రాష్ట్రీయం

విద్యారంగంలో స్వేచ్ఛ లేదు.. నియంత్రణ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 20: దేశంలో విద్యాబోధన స్వభావం మారిందని, తదనుగుణంగా విద్యార్ధులు ఆధునికతను అందిపుచ్చుకుని ప్రపంచమార్కెట్‌కు దీటుగా సిద్ధం కావాలని ఇగ్నో మాజీ విసి, ‘నేక్’మాజీ డైరెక్టర్, ఏసియా పసిఫిక్ క్వాలిటీ ఎడ్యుకేషన్ నెట్ వర్క్ వైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ వి ఎస్ ప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం నాడిక్కడ జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో విద్యావేత్త చుక్కారామయ్య రాసిన ‘పాఠం’ గ్రంథావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆదర్శవంతమైన విద్యా విధానంలో ప్రతి ఒక్కరూ తమ పాత్రను గుర్తించి నెరవేర్చాలని పేర్కొన్నారు.
విద్యావ్యవస్థను గాడిలో పెట్టడంలో ప్రభుత్వ పాత్ర చాలా కీలకమని, విద్యారంగాన్ని స్థూలంగా సమాజావసరాలకు అనుగుణంగా మార్చాలని పేర్కొన్నారు. దేశంలో విద్యారంగానికి సంబంధించి అవసరమైన స్వేచ్ఛగానీ, నియంత్రణ గానీ రెండూ లేవని వ్యాఖ్యానించారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సుమితా దావ్రా రామయ్య పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ, ఉన్నత విద్య అమలులో పెనుసవాళ్లున్నాయని, అయినా వాటిని అధిగమిస్తామని పేర్కొన్నారు. మహిళలు ఆదర్శాలతో పాటు విద్య, స్వతంత్ర వ్యక్తిత్వం, స్వీయ ఆలోచనా దృక్పథాలను అలవరచుకుని సాధికారత సాధించినపుడే గొప్ప అవకాశాలు దక్కుతాయన్నారు. కార్యక్రమంలో సామాజిక ఉద్యమకారుడు మల్లేపల్లి లక్ష్మయ్య, జూనియర్ కాలేజీ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్ మధుసూదనరెడ్డి, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె. రామచంద్రమూర్తి, భారత్ విద్యాసంస్థల చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా చుక్కారామయ్య 89వ జన్మదిన ఉత్సవాలను నిర్వహించారు. ఆశయాల్లో రాజీపడని వ్యక్తిత్వం, పోరాట పటిమ ఉన్న గొప్ప ఉపాధ్యాయుడు రామయ్య అని వక్తలు కొనియాడారు.