రాష్ట్రీయం

భద్రాద్రిలో పోటెత్తిన హనుమాన్ భక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, మే 31: ఖమ్మం జిల్లాలోని భద్రాచలం రామాలయం మంగళవారం హనుమాన్ భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన వేలాదిమంది హనుమాన్ మాలధారులు, వారి కుటుంబ సభ్యులు ఇరుముడి సమర్పించి భద్రాద్రి రామయ్యను దర్శించుకునేందుకు బారులు తీరారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో దేవస్థానం దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రామాలయం ఈవో కూరాకుల జ్యోతి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. తెల్లవారుజామున పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించిన హనుమాన్ దీక్షపరులు ఇరుముడులతో రామాలయానికి చేరుకున్నారు. ఇరుముడులతో క్యూలైన్లలో గంటలకొద్ది వేచి ఉండి రామయ్య దర్శనం చేసుకున్నారు. దర్శనం అనంతరం ఇరుముడులకు ప్రత్యేక పూజలు చేసి దీక్ష విరమణ గావించారు. ఈ సందర్భంగా రామాలయంలో, ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జై హనుమాన్.. జై శ్రీరామ్ నినాదాలతో రామాలయం మర్మోగిపోయింది.

చిత్రం క్యూలైన్లలో వేచి ఉన్న హనుమాన్ దీక్షాపరులు