రాష్ట్రీయం

రంగుమారిన ధాన్యం కొనుగోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13: రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు నిబంధనలను మినహాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది నవంబర్‌లో సంభవించిన తుపాను కారణంగా వరి పంట భారీగా దెబ్బతిన్నందున రైతుల నుంచి రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు నిర్ణయించిన ప్రభుత్వం, అందుకు అనుగుణంగా కొన్ని మార్గదర్శకాలను ఆదివారం జారీ చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నాణ్యతా ప్రమాణాల్లో సడలింపునిస్తూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో వరిపంట తుపాను వల్ల ఎక్కువగా దెబ్బతిందని ప్రభుత్వం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంతో కొన్ని మినహాయింపులతో రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అంగీకరించింది. ప్రస్తుతం రంగుమారిన ధాన్యాన్ని కొనేందుకు అనుమతిస్తున్న 5 శాతం పరిమితిని 10శాతానికి అనుమతించింది. అలాగే బియ్యం విషయంలో తడిసిన దానికి ప్రస్తుతం అనుమతిస్తున్న 3 శాతాన్ని 4 శాతానికి, రంగుమారిన దానికి 3 నుంచి 5 శాతానికి, నూకలున్న బియ్యానికి 25 నుంచి 30 శాతానికి పెంచుతూ కొనుగోళ్లు జరపాలని ప్రభుత్వం పౌరసరఫరాల శాఖను ఆదేశించింది. ఈ మినహాయింపులతో రైతులకు గరిష్ట మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని ఆ శాఖకు నిర్థిష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తడిసిన, రంగుమారిన ధాన్యం, బియ్యం కొనుగోళ్లు జరిపేందుకు అదనంగా రూ.39 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసిన పౌరసరఫరాల శాఖ కమిషనర్, ఆ నిధులను సాధారణ బడ్జెట్ కేటాయింపులకు అదనంగా మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకు ఆర్థిక శాఖ, పౌరసరఫరాల శాఖ ఏడాది మొత్తం బడ్జెట్ నుంచి తీసుకుని ఖర్చు పెట్టాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లు సకాలంలో స్పందించి తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని వెంటనే అనుమతించిన మినహాయింపులతో కొనుగోళ్లు జరిపేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. తూర్పుగోదావరిలో 2.37 లక్షల టన్నులు, పశ్చిమగోదావరి జిల్లాలో 2.59 లక్షల టన్నులు కలిపి మొత్తం 4.96 లక్షల టన్నుల ధాన్యం వరకే కొనుగోళ్లు పరిమితం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాకుండా ఈ మినహాయింపులన్నీ కేవలం ఖరీఫ్‌కు మాత్రమే వర్తిస్తాయని వెల్లడించింది. ఈ మినహాయింపులతో ధాన్యం కొనుగోళ్లు చేసేందుకు వీలుగా జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉన్న జిల్లా కొనుగోలు కమిటీలు తగిన సాంకేతిక నైపుణ్యం ఉన్న వారిని నియమించుకోవాలని, నాణ్యతా ప్రమాణాల పరిశీలన యంత్రాలు, తగిన పరికరాలను సిద్ధం చేసుకుని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ నిర్ణయంపై విస్తత్ర ప్రచారం చేయాలని తెలిపింది.