రాష్ట్రీయం

ఏపి పిజి ఈసెట్-2016 ఫలితాలు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూన్ 4: ఎపి పిజి ఈసెట్-2016 ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ఆచార్య లక్కసాని వేణుగోపాలరెడ్డి కాకినాడ జెఎన్‌టియులో శనివారం విడుదల చేశారు. గత రెండేళ్ళుగా ఎపి పిజి ఈసెట్‌ను కాకినాడ జెఎన్‌టియు నిర్వహిస్తోంది. ఈ ప్రవేశ పరీక్షలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో 22199 మంది దరఖాస్తు చేసుకోగా 19,780 మంది హాజరయ్యారు. 16945 మంది అర్హత సాధించగా 85.67 శాతం ఉత్తీర్ణత లభించింది. నాన్ లోకల్ కేటగిరీ కింద 1513 మంది దరఖాస్తు చేసుకోగా 1291 మంది హాజరయ్యారు. 1073 మంది అర్హత సాధించగా 83.11 శాతం ఉత్తీర్ణత నమోదయింది.
ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో 568 మంది దరఖాస్తు చేసుకోగా 432 మంది హాజరయ్యారు. 370 మంది అర్హత సాధించగా 85.65 శాతం ఉత్తీర్ణత నమోదయింది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలో 12,218 మంది దరఖాస్తు చేసుకోగా 10,803 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 9,236 మంది అర్హత సాధించగా 85.49 శాతం ఉత్తీర్ణత లభించింది. పరీక్షలకు మొత్తం 36,498 మంది దరఖాస్తు చేసుకోగా 32,306 మంది హాజరయ్యారు. వీరిలో 27,624 మంది అర్హత సాధించగా 85.51 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. ఈ సందర్భంగా వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ పోస్ట్‌గ్రాడ్యుయేషన్ కోర్సుల తరగతులను గత సంవత్సరంకంటే వారం రోజుల ముందుగా వచ్చే ఆగస్టు 1 నుండి ప్రారంభిస్తామన్నారు.
అన్ని రకాల ప్రవేశ పరీక్షలను జెఎన్‌టియుకె సమర్థవంతంగా నిర్వహిస్తోందని అభినందించారు. ఇటీవల ఎంసెట్ నుండి ఎపి పిజి ఈసెట్ వరకు నిర్వహణలో మంచి ఫలితాలు సాధించామని ఆయన పేర్కొన్నారు. జెఎన్‌టియుకె విసి ఆచార్య విఎస్‌ఎస్ కుమార్ మాట్లాడుతూ జెఎన్‌టియుకె నుండి విద్యాపరమైన సేవలను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటోందన్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన విద్యార్థుల కోసం కాపు విద్యోన్నతి, బిసిల కోసం బిసి విద్యోన్నతి పేర్లతో ప్రవేశ పరీక్షలను జెఎన్‌టియుకె నిర్వహించనున్నదని చెప్పారు. ఈ విధానంలో కాపు సామాజిక వర్గానికి చెందిన 500 మందిని, బిసి వర్గాలకు చెందిన 500 మందిని ఎంపిక చేసి సివిల్ సర్వీసుల కోసం శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. పోలీసు ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన ప్రవేశ పరీక్షలను కూడా తమ విశ్వవిద్యాలయమే నిర్వహిస్తుందని ఆయన తెలిపారు.