రాష్ట్రీయం

హైదరాబాద్‌లో 9వ అంతర్జాతీయ ముత్యాలు, రత్నాల ప్రదర్శన ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 4: హైదరాబాద్‌లో అంతర్జాతీయ 9వ ముత్యాలు, రత్నాల ప్రదర్శన శనివారం ప్రారంభమైంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కనె్వన్షన్ సెంటర్‌లో ఈ ప్రదర్శనను జిహెచ్‌ఎంసి మేయర్ బొంతు రాంమోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా జెమ్స్, జ్యుయలరీ ట్రేడ్ ఫెడరేషన్ చైర్మన్ జివి శ్రీ్ధర్, యుబిఎం ఎండి యోగేష్ ముద్‌రాస్ మాట్లాడుతూ ఈ ప్రదర్శనలో వందకుపైగా ప్రముఖ ఆభరణాల సంస్థలు పాల్గొన్నాయని చెప్పారు. రూబీ, ఎమరాల్డ్, ముత్యాలు వంటి విలువైన రాళ్లతో కూడిన ఆభరణాలను ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రదర్శన వల్ల తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలోని ఆభరణాల వ్యాపారం వృద్ధి చెందుతుందన్నారు. ఈ ప్రదర్శనకు రాయల్ థాయ్ కాన్సులేట్ జనరల్ జిట్టిమ నకమ హాజరయ్యారు.

చిత్రం శనివారం హైదరాబాద్‌లో 9వ ముత్యాలు, రత్నాల ప్రదర్శనను జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న జెమ్స్, జ్యుయలరీ
ట్రేడ్ ఫెడరేషన్ చైర్మన్ జివి శ్రీ్ధర్. చిత్రంలో హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ ఉన్నారు.