రాష్ట్రీయం

కార్మికుల సంక్షేమానికి మరిన్ని సంస్కరణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 4: కార్మికుల సంక్షేమానికి మరిన్ని సంస్కరణలు తెచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తున్నదని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. వెట్టిచాకిరి నిర్మూలనకు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఎన్డీఏ రెండేళ్ల పాలనపై దేశ వ్యాప్తంగా చేపట్టిన ‘వికాస్ పర్వ్’లో భాగంగా హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియంలో నిర్వహించిన సభకు సినీ, బీడి, భవన నిర్మాణ కార్మికులు, అసంఘటిత కార్మికులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. కార్మికుల బోనస్‌ను 10 నుంచి 21 వేల రూపాయలకు పెంచామని, సీలింగ్‌ను 3,500 నుంచి ఏడువేలకు పెంచామని ఆయన తెలిపారు. దీంతో 80 లక్షల మంది కార్మికులకు లాభం చేకూరిందని చెప్పారు. అన్ని సంస్ధలు వడ్డీ రేటును తగ్గిస్తుంటే తాము మాత్రం పిఎఫ్ వడ్డీ రేటును 8.8 శాతానికి పెంచామని, ఫలితంగా 17 కోట్ల 80 లక్షల మంది లాభపడుతున్నారని ఆయన తెలిపారు. 42 వేల కోట్ల రూపాయలు ఉపయోగంలో లేవని అన్నారు. యుపిఎ అధికారంలో ఉన్నప్పుడు వడ్డీ చెల్లించలేదని ఆయన విమర్శించారు. 9 కోట్ల 23 లక్షల ఖాతాలకు వడ్డీ చెల్లిస్తున్నామని అన్నారు.
వెట్టిచాకిరిని పూర్తిగా రూపుమాపేందుకు ప్రత్యేక పథకం రూపొందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఉద్యోగాల కల్పనకు వెయ్యి కోట్లు కేటాయించామన్నారు. ఉపాధి కల్పనకు హైదరాబాద్ ఉస్మానియా వర్సిటీలో, కరీంనగర్‌లో, దేశంలోని వంద కేంద్రాల్లో ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజీలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. సినీ, బీడి, భవన నిర్మాణ కార్మికులకు, ఆటోరిక్షా నడుపుకునే వారికి వైద్య సౌకర్యం కల్పిస్తున్నామని, 17 ఇఎస్‌ఐ డిస్పెన్సరీలను ఆసుపత్రులుగా మారుస్తామని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేస్తామన్నారు.
యువత ఖాళీగా ఉండరాదు: గవర్నర్
యువకులు, నిరుద్యోగులు ఖాళీగా ఉండరాదని గవర్నర్ నరసింహన్ అన్నారు. యువకులు ఖాళీగా ఉంటే తల్లిదండ్రులు శ్రద్ధ వహించి వారికి ఏదో ఒక ఉద్యోగం, ఉపాధి కల్పించి బాధ్యతల గురించి చెప్పాలని అన్నారు. వివిధ కారణాలతో అసంఘటిత కార్మికులుగా మారే వారికి విద్య అభ్యసించడానికి సాయంకాలం లేదా రాత్రి స్కూళ్ళు, కాలేజీలు ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ఆధార్, పెన్షన్, బ్లడ్, బ్యాంకు ఇలా పలు రకాల కార్డులు ఉండే బదులు ఒకే రకమైన (యునిక్) కార్డు ఉండేలా చూడాలని సూచించారు. సమావేశంలో రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తదితరులు కూడా మాట్లాడారు

శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘వికాస్ పర్వ్’ సభ వేదికపై కార్మికుడికి పిఎఫ్ చెక్కును అందజేస్తున్న కేంద్రమంత్రి దత్తాత్రేయ, తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి