రాష్ట్రీయం

టర్కీ నోట్ల ముఠా గుట్టు రట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 4: టర్కీ నోట్ల చెలామణి ముఠా గుట్టు రట్టయింది. చెల్లని టర్కీ నోట్లను విక్రయిస్తున్న ఇద్దరిని సెంట్రల్ జోన్ పోలీసులు అరెస్టు చేసి 96 టర్కీ (లిరా) నోట్లను స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన టి రత్నకుమార్, గుంటూరు జిల్లాకు చెందిన పి రామకృష్ణ కూకట్‌పల్లి నిజాంపేటలో నివాసముంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన లక్ష్మణ్ వద్ద 2005లో నిషేధించిన టర్కీ కరెన్సీని తీసుకున్నారు. లక్ష రూపాయలకు పదివేల కమిషన్ ఒప్పందంపై టర్కీ నోట్లను చెలామణి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకొని శుక్రవారం రాంనగర్‌లోని శ్రీనివాస టెక్స్‌టైల్స్‌కు వెళ్లారు. షాపింగ్ అనంతరం టర్కీ నోట్లు (లిరా) ఇచ్చి వీటి విలువ లక్షల్లో ఉంటుందని తెలిపారు. కె 4401420 నెంబరు గల నోటును ఇచ్చారు. దీంతో షాపు యజమాని అనుమానంతో ముషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. సుమారు రూ. 2.30 కోట్లు విలువ చేసే టర్కీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ముషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు సెంట్రల్ జోన్ డిసిపి కమలాసన్ రెడ్డి తెలిపారు.