రాష్ట్రీయం

విద్యుత్ ఆదాలో దేశానికి రోల్‌మోడల్ ఎపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 4: విద్యుత్ ఆదాలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని, ఈ రాష్ట్రం అనుసరిస్తున్న సాంకేతిక విధానాలు, ప్రణాళికను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుని అమలు చేయాలని విద్యుత్ ఆదాపై కేంద్రం నియమించిన కమిటీ ఓ నివేదికలో పేర్కొంది. ఈ వివరాలను ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విద్యుత్ రంగంలో మిగులు సాధించేందుకు ప్రాధాన్యత ఇచ్చారని, అదే సమయంలో విద్యుత్ ఆదాపై ప్రత్యేక శ్రద్ధను కనబరిచి అత్యుత్తమ విధానాలను అమలు చేస్తున్నారని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఈ కమిటీ నివేదిక అందుకున్న సందర్భంగా పీయూష్ గోయల్ మాట్లాడుతూ విధానాలను రూపొందించడమే కాకుండా మానవ వనరులను ఉపయోగించి వాటిని సరైన దారిలో అమలు చేయడం ప్రధాన కర్తవ్యమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ట్రాన్స్‌కో, జెన్కో, రెండు డిస్కంల అధికారులు, ఇంజనీర్లు ప్రజలతో మమేకమై విద్యుత్ ఆదాకు అనుసరించిన వినూత్న విధానాలు సంభ్రమాశ్చర్యానికి గురి చేస్తున్నాయని పేర్కొన్నారు. నేడు ఆంధ్రప్రదేశ్‌లోని కుగ్రామంలో కూడా విద్యుత్ ఆదాపై ప్రజలకు ఉన్న అవగాహన చూస్తే సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారని అజయ్ జైన్ అన్నారు. ఇటీవల రాష్ట్రంలో విద్యుత్ ఆదా కోసం ప్రత్యేకంగా ఎపి సీడ్కో సంస్ధను కూడా ఏర్పాటు చేశామని అజయ్ జైన్ తెలియజేశారు.

chitram కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో చంద్రబాబు నాయుడు