ఆంధ్రప్రదేశ్‌

వైద్యుల రిటైర్మెంట్ వయసు 65

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూన్ 5: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులల్లో పనిచేస్తున్న వైద్యుల పదవీ విరమణ వయస్సును 65 ఏళ్ళకు పెంచే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. వైద్య సంఘాలతో సంప్రదింపులు జరిపిన అనంతరం ఈ విషయంలో ముఖ్యమంత్రి తగిన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. విజయనగర పట్టణంలో ప్రభుత్వ ఘోషా ఆసుపత్రిలో పదికోట్ల రూపాయలతో ఆధునీకరించిన భవన సముదాయాన్ని మంత్రి కామినేని ఆదివారం ప్రారంభించారు. 1.06 కోట్ల రూపాయలతో నిర్మించే బాలుర సత్వర చికిత్స కేంద్రం పనులకు శంకుస్థాపన చేశారు. ఆధునీకరించిన ఘోషా ఆసుపత్రి భవనంలో ఏర్పాటుచేసిన సూపర్ స్పెషాలిటీ విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రులల్లో మందులకు ఎటువంటి కొరత లేదని చెబుతూ, సిబ్బంది కొరతను కూడా తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇప్పటికే 1400 మంది డాక్టర్లను నియమించామని, త్వరలో మరో 500 మంది నియామకానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఖాళీగా ఉన్న 200 సూపర్ స్పెషాలిటీ డాక్టర్ పోస్టుల భర్తీకి కూడా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విలేఖరుల సమావేశంలో కలెక్టర్ ఎంఎం నాయక్, ఎమ్మెల్యే మీసాల గీత, మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ ప్రసాద్, బిజెపి జిల్లా అధ్యక్షుడు జగన్మోహనరావు, శివప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నర్సింగ్ విద్యార్థినులకు పారితోషికం పెంపు
విశాఖపట్నం: రాష్ట్రంలోని బోధనాసుపత్రుల్లో పనిచేస్తున్న నర్సింగ్ విద్యార్థినులకు త్వరలోనే పారితోషికం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వైద్య, ఆరోగ్యశాఖామంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. విశాఖ కెజిహెచ్‌లో ఆదివారం నూతనంగా ఏర్పాటు చేసిన సూపర్ స్పెషాల్టీ బ్లాక్, జీవన్‌థాన్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ప్రభుత్వాసుపత్రుల ద్వారా రోగులకు సూపర్ స్పెషాలిటీ సేవలందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 6,700 మంది వైద్యవిద్యను అభ్యసించే విద్యార్థులకు ఈ-లెర్నింగ్‌తో కూడిన ట్యాబ్‌లను అందజేయనున్నామని చెప్పారు. రోగులకు సకాలంలో వైద్య సేవలందించేందుకు గుంటూరు, విశాఖ, కాకినాడ, తిరుపతి ప్రధాన కేంద్రాల్లో పిపిపి పద్ధతిలో శస్తచ్రికిత్సలను అందించడంతోపాటు అన్ని రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించనున్నామని పేర్కొన్నారు. ఉత్తమ సేవలందించే వైద్య సిబ్బందికి జీతంతోపాటు ప్రోత్సాహాకాలు అందజేస్తామన్నారు.
అలాగే విధుల్లో నిర్లక్ష్యం వహించేవారిపట్ల కఠినంగా వ్యవరించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఎన్టీఆర్ వైద్యసేవా పథకం ద్వారా జర్నలిస్టులకు, ప్రభుత్వ ఉద్యోగులకు మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్పారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనున్న ఖాళీ పోస్టుల్లో అధిక సంఖ్యలో నియామకాలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్‌రాజు, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్, కెజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.మధుసూదన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

కెజిహెచ్‌లోని సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌ను ప్రారంభిస్తున్న మంత్రి కామినేని శ్రీనివాస్