రాష్ట్రీయం

రాలేమంటే కుదరదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుళ్లూరు, జూన్ 6: కొత్త రాజధానిలో సహజంగానే ఇబ్బందులు ఉంటాయని, ఉద్యోగులు రాలేమంటే కుదరదని, నిర్దేశిత గడువులోపు తరలి రావాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను సోమవారం ఆయన పరిశీలించారు.
షాపూర్జీ అండ్ పల్లోంజి సంస్థ నిర్మిస్తున్న 2వ భవనాన్ని, ఎల్ అండ్ టి సంస్థ నిర్మిస్తున్న 5వ భవనాన్ని ఆసాంతం ఆయన కలియతిరిగి పరిశీలించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ 29 గ్రామాల రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారని, వారి స్ఫూర్తితోనే రాజధాని అభివృద్ధికి స్థిరత్వం వచ్చిందన్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని రీజియన్ కార్యాలయాలను ప్రధాన కార్యాలయాలుగా మార్పుచేసి పరిపాలన కొనసాగిస్తామన్నారు. ప్రతిపక్ష నేత జగన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ రాజకీయ ముసుగులో రౌడీయిజం కొనసాగించడం తగదన్నారు. ముఖ్యమంత్రిని బ్లాక్‌మెయిల్ చేసి హీరోలు అవుదామనుకుంటే కుదరదని, రాజకీయం ముసుగులో ఉన్న రౌడీలకు ప్రజలే బుద్ధి చెప్తారని చంద్రబాబు హెచ్చరించారు.

చిత్రం వెలగపూడిలో సోమవారం తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు