రాష్ట్రీయం

పిఎస్‌ఎల్‌వి-సి 34 ప్రయోగంపై నేడు షార్‌లో ఎంఆర్‌ఆర్ సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, జూన్ 6: భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ కేంద్రం నుండి ఈనెల 20వ తేదీన ప్రయోగించే పిఎస్‌ఎల్‌వి-సి 34 ప్రయోగానికి సంబంధించిన మిషన్ రెడీనెస్ రివ్యూ సమావేశం (ఎంఆర్‌ఆర్) మంగళవారం షార్‌లో జరగనుంది. ఇప్పటికే ఈ ప్రయోగానికి సంబంధించిన మూడు దశల రాకెట్ అనుసంధాన పనులు షార్‌లో శాస్తవ్రేత్తలు పూర్తిచేశారు. ఈ రాకెట్ ద్వారా మన దేశానికి చెందిన 690 కిలోల బరువు గల కార్టోశాట్-2సి ఉపగ్రహంతోపాటు మరో 21 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఒకేసారి 22 ఉపగ్రహాలను పిఎస్‌ఎల్‌వి వాహక నౌక ద్వారా అంతరిక్షంలోకి పంపనున్నారు. దీనికి సంబంధించిన ఎంఆర్‌ఆర్ సమావేశం డాక్టర్ సురేష్ అధ్యక్షతన షార్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు.ఈ రాకెట్ ఈనెల 20వ తేదీ ఉదయం 9.30 గంటలకు షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుండి నింగిలోకి ఎగరనుంది.