రాష్ట్రీయం

అక్రమార్కుల్ని అడ్డంగా నరికివేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 13: విజయవాడ నగరం ఇప్పటివరకు అనేకానేక విధాలైన నేరాలను చవిచూసింది. అయితే తాజాగా కాల్‌మనీ పేరిట మహిళల మాన, ప్రాణాలతో చెలగాటమాడుకుంటూ వెలుగులోకి వచ్చిన దందాను అంత తేలిగ్గా వదలరాదు.. ఎవరైనా, ఎంతటివారైనా, ఏ పార్టీవారైనా తన, మన చూడకుండా ఎన్‌కౌంటర్ చేయాలి.. లేదా అడ్డంగా నరికివేయాలంటూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) నిప్పులు చెరిగారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న తన కుమారుడు దేవినేని అవినాష్‌ను క్రమశిక్షణతో పెంచాను. మద్యం, కాల్‌మనీ లాంటి వ్యాపారాల జోలికి వెళితే పోలీసుల దాకా వెళ్లకుండానే అడ్డంగా నరికివేసేవాడిని.. అంటూ ఇలా పరుషంగా మాట్లాడాననుకోవద్దన్నారు. మద్యం వ్యాపారం సాగిస్తున్నందుకు గాను సోదరుడు బాజీని దూరంగా ఉంచానన్నారు. ఆంధ్రరత్న భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నెహ్రూ ఎంతో బాధాతప్త హృదయంతో ఒక్కోసారి ఆవేశపూరితంతోనూ మాట్లాడారు. పది లక్షలు అప్పు ఇచ్చి కోట్లాది రూపాయల ఆస్తులను రాయించుకోటం, మహిళల పుస్తెలను తాకట్టు పెట్టుకోవటమే గాక మహిళలతో వ్యభిచారం కూడా చేయిస్తుండటం ఎంత దారుణం.. భావితరాలు ఏమి కావాలన్నారు. సిఎం క్యాంప్ కార్యాలయానికి కూతవేటు దూరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో ప్రజాప్రతినిధులే గాక రాజకీయ నాయకులు మహిళలతో రాత్రి, పగలు విందులు, వినోదాలతో గడుపుతున్నారనే ఆరోపణలు ఇటీవల కాలంలో వినవచ్చాయి. అందుకే చంద్రబాబు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. ఎవరినీ వదలరాదన్నారు. అందమైన మహిళలు కన్పిస్తే వారిని అదిరించి, బెదిరించుకుని లొంగదీసుకున్నట్లు సిడీలు సాక్ష్యమిస్తుంటే సిఎం ఇక కర్కశంగానే వ్యవహరించాలన్నారు. మళ్లీ ఇలాంటి దందాలు పుట్టుకు రాకూడదన్నారు. గతంలో విజయవాడ రౌడీయిజానికి పెట్టింది పేరు అయితే ఏనాడూ ఏ ఒక్కరూ మహిళల జోలికి వెళ్లిన సందర్భాలు లేవన్నారు. తన 16వ ఏటనే కృష్ణలంక కరకట్టపై రెండు వర్గాలు కత్తులు, బరిశలతో దాడులు చేసుకుంటే ఆ తర్వాత పోలీసులు శవాలను లెక్కపెట్టాల్సి వచ్చేదన్నారు. కమ్యూనిస్టు పార్టీలో చీలికతో ఇలాంటి ఘర్షణలు, వర్గ పోరాటాలు మరింతగా ప్రబలాయంటూ దివంగత కాట్రగడ్డ నారాయణ, వంగవీటి రాధా, రంగాలు కూడా కమ్యూనిస్టు పార్టీ నుంచి బైటికి వచ్చిన వారేనన్నారు. ఈ రాజకీయాలు విద్యాసంస్థలకు పాకినప్పుడు తాను తెరపైకి రావాల్సి వచ్చిందన్నారు. పార్టీ తగాదాలు, వర్గ విభేదాలు మాత్రమే నాడు ఉండేవన్నారు. విలేఖరుల సమావేశంలో తనయుడు అవినాష్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కడియాల బుచ్చిబాబు, లీగల్ సెల్ చైర్మన్ తల్లాప్రగడ సుబ్బారావు పాల్గొన్నారు.