రాష్ట్రీయం

ఎన్‌కౌంటర్‌లో మహిళా మావో మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, జూన్ 13: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో సోమవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మడకం ఇడమా అనే మహిళా మావోయిస్టు మృతి చెందింది. సుక్మా జిల్లా కుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని గోంపాడు గ్రామం వద్ద కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. తరువాత జరిగిన గాలింపు చర్యల్లో కిష్టారం ఏరియా కమిటీ ప్లాటూన్ నెంబర్-8కు చెందిన మడకం ఇడమ మృతదేహం, బర్మార్ తుపాకీ సంఘటనా ప్రదేశంలో పోలీసులకు లభ్యమయ్యాయి. కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఇదిలావుండగా, భద్రాచలం ఏఎస్పీ భాస్కరన్ ఎదుట సోమవారం ఇద్దరు మహిళా మావోలు లొంగిపోయారు. పులుసు పాండే అలియాస్ కరుణ అలియాస్ కరుణక్క, కుంజం దేవి అలియాస్ సంగీత వెంకటాపురం సీఐ సాయిరమణ, చర్ల ఎస్సై రవీందర్ ఆధ్వర్యంలో ఏఎస్పీ ఎదుట లొంగిపోయారు. వీరికి ప్రభుత్వం తరపున అందాల్సిన పరిహారం అందిస్తామని ఏఎస్పీ తెలిపారు. కరుణక్కది చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని గంగులూరు గ్రామం. మరో సభ్యురాలు సంగీతది సుక్మా జిల్లా పైలా గ్రామం. కుటుంబ సభ్యుల సాయంతో వీరిద్దరూ భద్రాచలం ఏఎస్పీ ఎదుట లొంగిపోయారు.