ఆంధ్రప్రదేశ్‌

పట్టు సడలించిన ముద్ర గడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 15:ప్రభుత్వ సానుకూల దృక్పథంతో జరిపిన చర్చలు ఫలప్రదమై ఎట్టకేలకు కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైద్య పరీక్షలకు అంగీకరించారు. సాంకేతిక సమస్యల అనంతరం జైలు నుంచి బెయిలుపై ముద్రగడ అనుచరులను బయటకు తీసుకువచ్చిన తరువాత దీక్ష విరమణకు అంగీకారం కుదిరింది. తుని ఘటనలో అరెస్టులను నిరసిస్తూ ముద్రగడ గత ఏడురోజులుగా చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష విరమణకు కాపు జెఎసి, అధికారులు బుధవారం జరిపిన చర్చలు సానుకూల వాతావరణంలో నడుస్తున్నాయి. డిమాండ్లకు పరిష్కారం లభించడంతో ఇక దీక్ష విరమణే తరువాయిగా మిగిలింది. ముద్రగడ ప్రధాన డిమాండ్లపై చర్చలు కొలిక్కిరావడం, పూర్తిస్థాయిలో ఫలప్రదం కావడానికి సాంకేతిక అంశాలు అవరోధంగా నిలవడంతో వాటిని పూర్తిచేసేందుకు గడువు ఇస్తూ ఆలోగా వైద్య పరీక్షలకు ముద్రగడ పద్మనాభం అంగీకరించారు. దీనితో ఆయనకు రక్త నమూనాలు తీసుకుని ఐవి ఫ్లూయిడ్స్ ఎక్కించారు.
తుని ఘటనకు సంబంధించి లోతైన దర్యాప్తు జరిపేందుకు అరెస్టు చేసినవారిని బెయిలుపై విడుదలయ్యేందుకు సహకరించేలా చర్చల్లో అంగీకారం కుదరడంతో కొలిక్కి వచ్చాయి. అయితే లిఖిత పూర్వకంగా ఇవ్వాలని ముద్రగడ షరతు విధించడంతో కొంత ప్రతిష్టంభన ఏర్పడినా అరెస్టు అయినవారు బెయిలుపై విడుదలైన తరువాతే దీక్ష విరమిస్తానని పట్టుబట్టడంతో వారికి బెయిలు వచ్చేందుకు సమయం పట్టే అవకాశమున్న దృష్ట్యా ఈలోగా వైద్య పరీక్షలకు ఆయన అంగీకరించడంతో రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో ఆయన సాగస్తున్న దీక్షసుఖాంతం దిశగా సాగుతోంది. అరెస్టు అయిన 13 మంది బెయిలుపై విడుదలయ్యేందుకు మూడురోజుల సమయం పట్టే అవకాశమున్న దృష్ట్యా అప్పటివరకు కూడా ముద్రగడ దీక్షలో ఉన్నట్టుగానే లెక్క. అయితే ఆయనకు వైద్య పరీక్షలు చేసిన దృష్ట్యా అటు ప్రభుత్వం, ఇటు అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. బుధవారం కూడా సెంట్రల్ జైలులో రిమాండులో ఉన్న కాపు ఉద్యమ నాయకులు ఆకుల రామకృష్ణ, వాసిరెడ్డి ఏసుదాసు, నల్లా విష్ణు తదితరులను వైద్య పరీక్షల నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. వారు కూడా చర్చల్లో పాల్గొన్నారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణతోపాటు కాపు జెఎసి నాయకులు చినమిల్లి రాయుడు, మిండగుదిటి మోహన్, అడపా నాగేంద్ర, ఆరేటి ప్రకాష్, జివి రావు, తోట రాజు, యాళ్ల దొరబాబు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ కూడా పాల్గొన్నారు. డిఐజిలు రామకృష్ణ, శ్రీకాంత్, ఎస్పీలు రవిప్రకాష్, రాజకుమారి చర్చల్లో ఉన్నారు.
బుధవారం ఉదయం నుంచి పలుదఫాలు చర్చలు జరిగాయి. కాపు జెఎసి మరికొన్ని డిమాండ్లను చేర్చినప్పటికీ తాను మొదటి నుంచి డిమాండ్ చేస్తున్న కేసుల ఎత్తివేత, అరెస్టుచేసిన వారిని విడుదల చేయడంపైనే ముద్రగడ స్పష్టంచేసినట్టుగా తెలిసింది. లోతైన దర్యాప్తు, అరెస్టు అయినవారిని బెయిలుపై బయటకు తీసుకురావడంలో ప్రభుత్వం సానుకూల దృక్పథం వ్యక్తం చేయడంతో చర్చలు కొలిక్కి వచ్చాయి. లిఖితపూర్వకంగా కావాలని పట్టుబట్టడంతో కొద్దిసేపు చర్చలు ఆగిపోయినట్టుగా వార్తలొచ్చినా చివరకు సంప్రదాయబద్ధంగా చేయాలని ప్రతిపాదన వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. చర్చలు ఫలప్రదం కాని పక్షంలో ప్రాణాపాయం లేకుండా బలవంతపు వైద్యం చేసేందుకు కూడా సిద్ధమైనట్టు వార్తలొచ్చాయి.

చిత్రం... చర్చల వివరాలు మీడియాకు తెలియజేస్తున్న కాపు జెఎసి నాయకులు