రాష్ట్రీయం

మీతోనే రాష్ట్రానికి వనె్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 16: తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ పిల్లలను క్రమశిక్షణతో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఉంగుటూరు మండలం, ఆత్కూరు గ్రామంలో స్వర్ణ్భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం జిల్లాలోని అన్ని మండలాల్లో పదవ తరగతిలో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థులకు ప్రతిభకు పురస్కార ప్రదాన కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ప్రతిభకు మెరుగైన సేవలు అందించటం స్ఫూర్తిదాయకమని అన్నారు. సంపాదించిన దానిలో కొంత సమాజం కోసం ఖర్చుచేయటం ఆనందానిస్తుందని పేర్కొన్న ఆయన చిన్నతనం నుండి పిల్లలల్లో సేవానిరతిని పెంపొందించాలని పిలుపునిచ్చారు. పిల్లలకు తెలివితేటలు విజ్ఞానం వల్ల వస్తాయని చెప్పిన ఆయన మాతృభాషను పరిరక్షించుకుంటూ జాతి ఔన్నత్యాన్ని కాపాడుకోవాలన్నారు. మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల మన రాష్ట్రానికి చెందినవారేనని, గూగుల్ అధినేత మన పొరుగు రాష్ట్రానికి చెందినవారని, వారిని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. తెలివితేటలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని, భారత మాజీ రాష్టప్రతి, భారతరత్న అబ్దుల్ కలాం చిన్నతనంలో పేపర్‌బాయ్‌గాను, ప్రపంచ అగ్రనేతల్లో గుర్తింపు పొందుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టీ బాయ్‌గాను పనిచేసినవారేనని గుర్తుచేశారు. నటనతో ప్రతిభా పాటవాలు ప్రదర్శించి గుర్తింపు పొందిన నందమూరి తారక రామారావును నేటికీ అనేక మంది దేవుడిలా భావిస్తారని ముఖ్యమంత్రి అన్నారు. దక్షిణ భారతదేశంలో నిజాయతీపరుడుగాను, కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మనందరికీ ఆదర్శం కావాలన్నారు. ఇటీవల ఎయిమ్స్, ట్రిపుల్ ఐటి, జిప్‌మర్ వంటి ప్రతిష్ఠాత్మక పోటీ పరీక్షల్లో మన రాష్ట్రానికి చెందినవారే టాప్ ర్యాంకులు సాధిస్తున్నారని ముఖ్యమంత్రి అన్నారు. మన రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్, నాలెడ్జ్ స్టేట్‌గా తయారుచేసేందుకు ప్రభుత్వపరంగా కార్పొరేట్ విద్యను అందించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఫైబర్ గ్రిడ్ ద్వారా ఇంటర్‌నెట్ సదుపాయాన్ని కల్పించి డిజిటల్ క్లాస్‌లు ద్వారా కార్పొరేట్ విద్య అందిస్తామన్నారు.
కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ కష్టపడితే తప్పక ఫలితం వస్తుందని, మనసుతో ఇష్టపడి చదువుకోవాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. మాతృభాష మాధుర్యాన్ని ఆస్వాదించాలని ఎక్కడికి వెళ్లానా మాతృభాషను మర్చిపోకూడదన్నారు. కార్యక్రమంలో 57మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను ముఖ్యమంత్రి చంద్రబాబు, వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రులు అందజేశారు. కార్యక్రమంలో శాసనసభ డెప్యూటీ స్పీకర్ మండలి బుద్దప్రసాద్, రాష్ట్ర మంత్రులు ఘంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, కామినేని శ్రీనివాసరావు, కొల్లు రవీంద్ర, పి.మాణిక్యాలరావు, జిల్లా కలెక్టర్ బాబు.ఎ, సబ్ కలెక్టర్ డా.లక్ష్మీషా, స్వర్ణ్భారతి ట్రస్ట్ అధ్యక్షుడు ఎం.ప్రభాకరరావు, కార్యదర్శి సిహెచ్ రామకృష్ణప్రసాద్, చాప్టర్ డైరెక్టర్ డి.పరదేశి పాల్గొన్నారు.

చిత్రం 9వ తరగతి విద్యార్థులతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు