రాష్ట్రీయం

అట్టుడుకుతున్న సెంట్రల్ యూనివర్శిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 16: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఇద్దరు అధ్యాపకులను సస్పెండ్ చేసిన నేపథ్యంలో యూనివర్శిటీ మరో మారు అట్టుడికిపోతోంది. మరో ఐదుగురు బోధనేతర సిబ్బందిపై వేటు వేసేందుకు రంగం సిద్ధమైందని తెలియడంతో ఉద్యమానికి వారు సైతం ముందుకు వచ్చారు. దళిత అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె.వై రత్నం, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తథాగత్ సేన్ గుప్తలపై యూనివర్శిటీ యాజమాన్యం సస్పెండ్ చేయడాన్ని అంబేద్కర్ విద్యార్థి సంఘం నేతలు, సామాజిక న్యాయ సంయుక్త కార్యాచరణ కమిటీ సభ్యులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ యూనివర్శిటీ మెయిన్ గేట్ వద్ద గురువారం సైతం రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. యూనివర్శిటీల్లో కుల అణచివేత హింసలను అరికట్టాలని వారు కోరారు. విద్యార్థుల రిలే నిరసన దీక్షల్లో యూనివర్శిటీ సస్పెండ్ చేసిన ప్రొఫెసర్లు సైతం పాల్గొన్నట్టు తెలిసింది. మరోపక్క రోహిత్ వేముల న్యాయపోరాట సంఘీభావ కమిటీ సైతం సస్పెన్షన్లపై నిలదీసింది. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు ఎదుర్కొంటున్న వైస్ ఛాన్సలర్ అధ్యాపకులపై ఎలా చర్యలు తీసుకుంటారని సంఘీభావ కమిటీ ప్రశ్నించింది. దీంతో యూనివర్శిటీలో పరిస్థితులు మరోసారి భగ్గుమన్నాయి.
రోహిత్ దళితుడేనా...?
రోహిత్ కుటుంబం ఎస్సీలు కాదనే వాదనల మధ్య తాజాగా గుంటూరు జిల్లా కలెక్టర్ రోహిత్ దళితుడేనని పేర్కొంటూ జాతీయ ఎస్సీ కమిషన్‌కు నివేదిక పంపారనే సమాచారంతో యూనివర్శిటీలో వ్యవహారాలు వేగంగా మారుతున్నాయి. ఎస్సీ కమిషన్ రోహిత్ దళితుడేనని తేల్చిన పక్షంలో గతంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు, వైస్ ఛాన్సలర్ అప్పారావులపై పెట్టిన కేసులను తిరగదోడే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో యూనివర్శిటీలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

చిత్రం యూనివర్శిటీ మెయిన్ గేట్ వద్ద గురువారం రిలే నిరాహార దీక్షలు కొనసాగించిన అంబేద్కర్ విద్యార్థి సంఘం నేతలు