రాష్ట్రీయం

భవిత బిజెపిదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 17: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు జరగనున్న ఎన్నికల్లో కూడా బిజెపి ఘన విజయం సాధిస్తుందని, భవిష్యత్ కూడా మనదేనని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. రాజస్థాన్ నుండి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారి హైదరాబాద్ వచ్చినపుడు ఆయనకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. విజయవాడ నుండి హైదరాబాద్ వచ్చిన వెంకయ్యకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన నేరుగా పార్టీ కార్యాలయానికి చేరుకుని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. బిజెపి తనకు తల్లిలాంటిదని, ఎన్నో ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిందని అన్నారు. పదవి ఉన్నా లేకున్నా పార్టీ కోసం ఎంతో మంది అహర్నిశలూ కృషి చేస్తున్నారని, బిజెపి అంటే క్రమశిక్షణకు మారు పేరని అన్నారు. దేశవ్యాప్తంగా భౌగోళికంగా చూస్తే 46 శాతం మేర బిజెపి విస్తరించి ఉందని, గత ఎన్నికల్లో కేరళలో రికార్డు స్థాయిలో 15 శాతం మేర ఓట్లు సాధించామని అన్నారు. బెంగాల్‌లో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కలిసి పోటీ చేసినా బిజెపికి 10.7 శాతం ఓట్లు వచ్చాయన్నారు. రాజ్యసభకు 57 సీట్లు ఖాళీ అయితే ఏ ఒక్క పార్టీ మైనార్టీలకు ప్రాతినిధ్యం కల్పించలేదని, బిజెపి మాత్రమే ఇద్దరు మైనార్టీలకు అవకాశం ఇచ్చిందని పేర్కొన్నారు. ఎంజె అక్బర్, ముక్తార్ అబ్బాస్ నక్వీలను రాజ్యసభకు పంపించామని, ఇంతవరకూ మిగిలిన పార్టీలు మైనార్టీలను ఓటు బ్యాంకుగా పరిగణించడమే తప్ప వారి సమస్యలను మాత్రం పరిష్కరించలేదని, ఇపుడు మైనార్టీలు సైతం బిజెపి వైపు చూస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రజల మధ్య వైషమ్యంతో కాదని, కేవలం పరిపాలనా సౌలభ్యం కోసమేనని, కేంద్రం ఇరు రాష్ట్రాలకూ అన్ని విషయాల్లో ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. అనంతరం వెంకయ్యను సత్కరించేందుకు పార్టీ నేతలు పోటీపడ్డారు. ఒక దశలో తొక్కిసలాట జరగడంతో వారిని శాంతింపచేసి వెంకయ్యనాయుడు అక్కడి నుండి వెళ్లిపోయారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎపి మంత్రి కామినేని శ్రీనివాస్, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్, మాజీ అధ్యక్షుడు జి కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.