రాష్ట్రీయం

విశాఖలో కాశ్మీరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 18: కాశ్మీర్ పేరు చెబితే స్పురించేది తియ్యటి యాపిల్స్. మనకు సదా అందుబాటులో ఉండే యాపిల్స్ అత్యధిక శాతం కాశ్మీర్, సిమ్లా ప్రాంతాల నుంచే దిగుమతి అవుతుంటాయి. మనం తినే యాపిల్స్‌ను మనమే పండిస్తే పోలా అన్న అలోచన స్పురించడంతో మన శాస్తవ్రేత్తలు ఆ దిశగా అడుగులు వేశారు.. విజయం సాధించారు. చింతపల్లిలోని ఆచార్య రంగా వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్తవ్రేత్తలు చేసిన ప్రయోగాలు ఫలించాయి. యాపిల్ సాగుకు అనువైన వాతావరణం మన రాష్ట్రంలోనే ఉందని, ఆ దిశగా విస్తృత ప్రయోగాలు చేసి విజయం సాధించారు. ప్రయోగాత్మకంగా కొద్దిపాటి వ్యవసాయ క్షేత్రంలో పండించిన యాపిల్ మొక్కలు మొగ్గతొడిగి కాయ రూపు దాల్చాయి. మరో రెండేళ్లలో పూర్తి స్థాయిలో ప్రయోగాల ఫలితం దక్కుతుందని శాస్తవ్రేత్తలు స్పష్టం చేస్తున్నారు.
విశాఖ ఏజెన్సీలోని చింతపల్లి, జికె వీధి, అరకు, పాడేరు, తదితర మండలాలు యాపిల్ సాగుకు అనుకూలంగా గుర్తించిన శాస్తవ్రేత్తలు ఆ దిశగా ప్రయోగాలు ప్రారంభించారు. చింతపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఎకరం స్థలంలో రెండేళ్ల కిందట యాపిల్ సాగుకు అనువైన వాతావరణాన్ని సృష్టించారు. సిమ్లా యాపిల్ కాకుండా, కొత్త వంగడాలను తీసుకువచ్చి తమ ప్రయోగాలకు పదును పెట్టారు. అన్నా, మైఖేల్, ఫేవర్‌బుల్ తదితర వంగడాలను ప్రయోగాత్మకంగా వ్యవసాయ పరిశోధన క్షేత్రంలో పెంచారు. మిగిలిన రకాలు కూడా పండించేందుకు అనువైనప్పటికీ తొలి దశలో తమ ప్రయోగాలను కొన్ని వంగడాలకే పరిమితం చేశారు. రెండేళ్లుగా వీటిని శ్రద్ధగా సాకుతున్న వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్తవ్రేత్తలకు ఇటీవలే కాపుకు వచ్చిన యాపిల్స్ ఎంతో సంతోషాన్నిచ్చాయి.
చింతపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రంలో యాపిల్ సాగుపై సైంటిస్ట్ శేఖర్ ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ కొత్త పంటలపై తమ పరిశోధన నిరంతరం కొనసాగుతుందని, అందులో భాగంగానే యాపిల్ సాగుపై ప్రయత్నించి విజయం సాధించామన్నారు. యాపిల్ పంట వేసిన తరువాత నాలుగేళ్ల వరకూ పూర్తి స్థాయిలో ఫలసాయం రాదని, ప్రయోగాత్మకంగా తాము చేపట్టిన ఈ పరిశోధనలో కొన్ని మొక్కలు ఇప్పుడిప్పుడే పంట దశకు వస్తున్నాయన్నారు.
యాపిల్ సాగులో తమ కృషి ఫలించడం ద్వారా గిరిజన ప్రాంతంలో అధిక ఆదాయాన్నిచ్చే పంటకు రూపకల్పన జరిగినట్టు భావిస్తున్నామన్నారు. ఇప్పటివరకూ ఆహార ధాన్యాలు, వాణిజ్య పంటలపైనే దృష్టి సారించినప్పటికీ గిరిజనులను ఆర్థికంగా పరిపుష్టి చేసే యాపిల్, కాఫీ, మిరియాలు తదితర పంటలకు ప్రాధాన్యత పెరుగుతుందన్నారు. అలాగే వరి, చోడి, రాగి వంటి ఆహార ధాన్యాలు, పసుపు, అల్లం తదితర వాణిజ్య పంటలకు కూడా పరిశోధనల్లో ప్రాధాన్యత ఇస్తున్నట్టు వెల్లడించారు.

చిత్రం విశాఖ జిల్లా చింతపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్తవ్రేత్తలు పండించిన యాపిల్