రాష్ట్రీయం

యాగంలా పల్స్ సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 18: మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రభుత్వ ప్రయోజనాలను నిజమైన లబ్ధిదారులకు చేర్చడం కోసమే స్మార్ట్ పల్స్ సర్వే నిర్వహిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ఇది ప్రజలందరి సంపూర్ణ వివరాలకోసం చేపడుతున్న సర్వే అని, సంక్షేమ కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కాబోదన్నారు. ప్రభుత్వం ఈనెల మూడవ వారంలో చేపట్టనున్న స్మార్ట్ పల్స్ సర్వేపై శనివారం మధ్యాహ్నం తన నివాసం నుంచి ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భవిష్యత్‌లో ఆధార్ సంఖ్యలేని ప్రజలకు ప్రభుత్వపరంగా ఎలాంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందబోవని సిఎం స్పష్టం చేశారు. ప్రతి పదేళ్లకు ఒకసారి జనగణన జరుగుతుండగా, పల్స్ సర్వే అంతకుమించిన తాజా వివరాలతో, వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేదిలా ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి, కుటుంబం ఆదాయం, ఆరోగ్యం, సామాజిక భద్రత గురించిన అన్ని అంశాలను సర్వే ద్వారా తెలుసుకునే అవకాశం కలుగుతుందని చెప్పారు. ఇది రాష్ట్ర ప్రయోజనాలకు ఉపకరించే సర్వే అయినందున ప్రతి ఒక్క అధికారి దీన్ని ఒక యాగంలా తీసుకుని అంకితభావంతో పనిచేయాలని కోరారు. ఈ ప్రభుత్వం సర్ట్ఫికెట్ లెస్ గవర్నెన్స్ లక్ష్యంగా కృషి చేస్తోందని, ఇప్పటికే 60శాతం వివరాలు అనుసంధానం పూర్తయినందున మరో 40 శాతం పనిని పూర్తిచేయడానికే పల్స్ సర్వే చేపట్టినట్టు తెలిపారు. ఆధార్ వివరాలతో మొబైల్ నెంబర్ అనుసంధానం చేసి నిర్వహిస్తున్న సర్వే ఇదేనని, దేశంలో వ్యక్తులు, కుటుంబాలకు సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని సేకరిస్తున్న సర్వే కూడా ఇదే ప్రథమమని ముఖ్యమంత్రి వివరించారు. 35వేల బృందాలు ఈ సర్వేలో పాల్గొంటున్నాయని, ఒక్కొక్క ఎన్యూమరేటర్ ప్రతిరోజూ 14 ఇళ్లకు వెళ్లి అక్కడి డేటాను సేకరిస్తారని చెప్పారు. పల్స్ సర్వే అధికారుల మధ్య సమన్వయం కోసం కమాండ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. 22న పల్స్ సర్వే కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. మొత్తం సర్వేకు రెవెన్యూ శాఖ నోడల్ ఏజెన్సీగా ఉంటుందని వివరించారు. 20 కొలమానాల ఆధారంగా పల్స్ సర్వే నిర్వహిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్, వాటర్ బిల్, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ కుల ధ్రువీకరణ పత్రం, కిసాన్ పత్రం, డ్వాక్రా సర్ట్ఫికెట్, పోస్ట్ లేదా ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్ వగైరా కొలమానాల ఆధారంగా ఈ సర్వే నిర్వహిస్తారని చెప్పారు. పల్స్ సర్వేని మిషన్ మోడ్‌లో నిర్వహించాలని అధికార యంత్రాంగానికి సిఎం సూచించారు. భూమి వివరాలు, నేల స్వభావం, పంటల వివరాలు కూడా సర్వేలో సమీకృతం చేయాలని అధికారులకు సిఎం సూచించారు. పెన్షన్స్, స్కాలర్‌షిప్స్, రుణాలు వగైరా వివరాలన్నీ పల్స్ సర్వేలో ఇంటిగ్రేట్ అయ్యేలా చూడాలని కోరారు. ట్యాబ్స్, ఐప్యాడ్స్ వంటి ఆధునిక ఉపకరణాల ద్వారా చేపట్టే ఈ సర్వేలో సేకరించిన వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తారని వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి టక్కర్, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, ప్రభుత్వ ఐటి కార్యదర్శి ప్రద్యుమ్న, ఐఅండ్‌పిఆర్ కమిషనర్ వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న చంద్రబాబు