రాష్ట్రీయం

తొలకరి వచ్చింది.. ఉత్సాహం తెచ్చింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 18: ఎట్టకేలకు నైరుతి రుతుపవనాల మూలంగా తొలకరి జల్లులు కోస్తా, రాయలసీమ అన్ని జిల్లాలతో పాటు, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో పడుతుండటంతో రైతులు ఆనందపడుతున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలతో పాటు తెలంగాణలోని మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో విస్తరించాయి. ఈ రుతుపవనాలు మిగిలిన తెలంగాణ జిల్లాల్లో సోమవారం లోపు విస్తరిస్తాయని ఐఎండి శాస్తవ్రేత్త చరణ్‌సింగ్ ప్రకటించారు. గత 20 రోజుల నుండి అక్కడక్కడా కురిసిన వర్షాలు రుతుపవనాల ముందస్తు వర్షాలేనని, ఇక నుండి కురిసే వర్షాలు రుతుపవనాల ప్రభావంగా కురిసే వర్షాలని వివరించారు. తొలకరి పలకరింపుతో రైతులు విత్తనాలు వేయడం ప్రారంభించారు. కొన్ని ప్రాంతాల్లో ముందస్తు వర్షాలకే విత్తనాలు వేశారు. వ్యవసాయ శాఖ అధికారులు కూడా అప్రమత్తంగా ఉంటూ రైతులకు అవసరమైన విత్తనాలను అందించేందుకు ఏర్పాట్లు చేశారు.