రాష్ట్రీయం

జుడీషియల్ కస్టడీకి కళానికేతన్ ఎండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మవరం రూరల్, జూన్ 23: చేనేత వ్యాపారులకు కోట్ల రూపాయలు బకాయి ఉన్న కళానికేతన్ టెక్స్‌టైల్స్ అండ్ జ్యుయలరీస్ సంస్థ ఎండి లీలాకుమార్‌ను 14 రోజుల రిమాండ్‌కు ఆదేశిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీచేశారు. లీలాకుమార్‌ను ధర్మవరం పోలీసులు బుధవారం కర్నూలులో అరెస్టు చేశారు. ధర్మవరం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో డిఎస్‌పి వేణుగోపాల్, సిఐ హరినాథ్, ఎస్‌ఐ సునీత సమక్షంలో గురువారం లీలాకుమార్‌ను మీడియా ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా డిఎస్‌పి వేణుగోపాల్ మాట్లాడుతూ లీలాకుమార్ ధర్మవరంలోని చేనేత వ్యాపారులకు దాదాపు రూ.9 కోట్ల వరకు చెల్లించాల్సి ఉందన్నారు. దీంతో జనవరి 7వ తేదీ 13మంది చేనేత వ్యాపారులు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో లీలాకుమార్‌తో పాటు డైరెక్టర్లపై ఫిర్యాదు చేశారన్నారు. రూ.4.14 కోట్ల రూపాయలు లీలాకుమార్ బకాయిపడినట్లు వారు ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని గత ఆరు నెలలుగా లీలాకుమార్ కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. ఈ తరుణంలో ఈనెల 6న సంస్థ డైరెక్టర్ లక్ష్మీశారదను అదుపులోకి తీసుకున్నామన్నారు. బుధవారం సాయంత్రం కర్నూలులో లీలాకుమార్ పట్టుబడినట్లు ఆయన తెలిపారు. చేనేతలకు సుమారు రూ.9 కోట్ల వరకు చెల్లించాల్సి ఉందని లీలాకుమార్ తమ సమక్షంలో అంగీకరించారన్నారు. ఇతనిపై సెక్షన్ 409, 420 రెడ్‌విత్, 34 ఐపిసి, 156(3) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు డిఎస్‌పి తెలిపారు. వైద్యపరీక్షల నిమిత్తం పట్టణంలోని ప్రభుత్వాస్పత్రికి లీలాకుమార్‌ను తరలించి అనంతరం కోర్టులో హాజరుపరిచారు. కేసును విచారించిన జూనియర్ సివిల్ కోర్టు జడ్జి లీలావతి 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం లీలాకుమార్‌ను ధర్మవరం సబ్‌జైలుకు తరలించారు. విచారణ నిమిత్తం లీలాకుమార్‌ను తమకు అప్పగించాలని కోర్టును కోరనున్నట్లు పోలీసులు తెలిపారు.
మాస్టర్‌మైండ్ వివరాలు వెల్లడిస్తా: లీలాకుమార్
తమ కుటుంబం 26 ఏళ్ల క్రితం కళానికేతన్ టెక్స్‌టైల్స్ అండ్ జ్యుయలరీస్ సంస్థను స్థాపించి అంచెలంచెలుగా ఎదిగిందని కళానికేతన్ ఎండి లీలాకుమార్ తెలిపారు. ధర్మవరం పోలీస్‌స్టేషన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ఆరు నెలలుగా తనపై పలు కేసులు నమోదయ్యాయని, తప్పించుకుని తిరగడానికి బలమైన కారణాలు ఉన్నాయన్నారు. తన వెనుక ఉన్న మాస్టర్‌మైండ్ వివరాలు త్వరలో వెల్లడిస్తానన్నారు. ఇప్పటికే పోలీసులకు అన్ని విషయాలు చెప్పానన్నారు. తాను వందల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయని, అందులో వాస్తవం లేదన్నారు. తమ సంస్థకు సరుకు సరఫరా చేసిన వారికి రూ.67 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. తన పేర కాస్‌మోస్ బ్యాంక్‌లో రూ.58 కోట్ల అప్పు ఉందని, అయితే బ్యాంకుకు రూ.52 కోట్ల ఆస్తులు తనఖా పెట్టామన్నారు. తనకు వ్యక్తిగతంగా రూ.14 కోట్ల ఆస్తులు ఉన్నాయని లీలాకుమార్ వివరించారు.