రాష్ట్రీయం

యువకుడి కడుపులో గర్భసంచి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, జూన్ 23: ఒక యువకుని కడుపులో గర్భసంచి ఉండడాన్ని వైద్యులు గుర్తించారు. ఇది సృష్టికి విరుద్ధమైనా, జన్యుపరమైన లోపంతో ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. తమిళనాడు రాష్ట్రం హోసూరుకు చెందిన అమరనాథ్ (22) గత కొంత కాలంగా హెర్నియా వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఆపరేషన్ కోసం కుప్పంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిని ఆశ్రయించాడు. అయితే డాక్టర్లు ఆపరేషన్ చేస్తుండగా అమరనాథ్ కడుపులో గర్భసంచి ఉన్నట్లు గుర్తించారు. అయితే ఇలాంటి సమస్య కొన్ని వేల మందిలో ఒకరికి ఉంటుందని, జన్యుపరమైన లోపం కారణంగానే ఇలా జరిగిందని కుప్పంకు చెందిన శ్రీ ప్రియ నర్సింగ్‌హోమ్ వైద్యులు డాక్టర్ సుధీర్ తెలిపారు. అయితే హెర్నియాతో పాటు, గర్భసంచిని కూడా తొలగించినట్లు డాక్టర్ వివరించారు. ప్రస్తుతం అమరనాథ్ ఆరోగ్యంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.