రాష్ట్రీయం

ఉదయ్‌లో టి.డిస్కాంల భాగస్వామ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 23: విద్యుత్ పంపిణీ సంస్థలను (డిస్కామ్) నష్టాల ఊబి నుంచి బయట పడేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉదయ్ పథకంలో తెలంగాణ రాష్ట్రం భాగస్వామ్యం అవుతుందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. డిస్కాలకు ఉన్న అప్పులను తీర్చడం ద్వారా వాటిపై ఆర్థిక భారానాన్ని తగ్గిస్తామని ముఖ్యమంత్రి అన్నారు. డిస్కామ్‌ల అప్పులు తీర్చడానికి నిధులు సమీకరించుకోవడానికి ఎఫ్‌ఆర్‌బిఎం మినహాయింపులు ఇవ్వడం సానుకూల అంశమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ గురువారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. ఉదయ్ పథకంలో చేరాల్సిందిగా గోయల్ ముఖ్యమంత్రిని కోరగా సానుకూలంగా స్పందించారు. దీన దయాల్ పథకంలో ఎక్కువ నిధులు ఇవ్వడంతో పాటు తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లకు అవసరమైన బొగ్గును కేటాయించడానికి కేంద్ర మంత్రి అంగీకరించారు. ఉదయ్‌లో తెలంగాణ ప్రభుత్వం చేరాలని నిర్ణయించడంతో కేంద్ర, రాష్ట్ర అధికారులు మరోసారి సమావేశమై ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. దేశంలో ఎల్‌ఇడి లైట్ల వినియోగం అవసరంపై చర్చ జరిగింది. తెలంగాణలోని 26 నగర పంచాయతీలు, 12 మున్సిపాల్టీల పరిధిలో ఇప్పటికే ఎల్‌ఇడి వీధిలైట్లు వాడుతున్నట్టు ముఖ్యమంత్రి వివరించారు. ఎల్‌ఇడి లైట్ల వాడకం వల్ల విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గుతుందని, దీనిని తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. ఎల్‌ఇడి బల్బుల ధరలు రోజు రోజుకు తగ్గుతుండటంతో ఇఇఎల్‌ఎల్ సంస్థతో సంప్రదింపులు జరిపి ఒప్పందాలు కుదుర్చుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాష్టవ్య్రాప్తంగా 22 లక్షలకు పైగా పంపుసెట్లు ఉన్నాయని, దీని కోసం ఎక్కువ విద్యుత్ అవుతుందని ముఖ్యమంత్రి అన్నారు. తక్కువ విద్యుత్ వినియోగం జరిగే పంపు సెట్లు మార్కెట్‌లోకి వచ్చాయని, వీటిని రాష్ట్రంలో విరివిగా ఉపయోగించుకోవాలని కేంద్ర మంత్రి సూచించారు. రాష్ట్రంలో దశల వారీగా పంపుసెట్లను మార్చుకోవడానికి కేంద్రం అవసరమైన సాయం అందిస్తుందని కేంద్ర మంత్రి గోయల్ హామీ ఇచ్చారు. ప్రతీ వినియోగదారుడు ప్రతీ రోజు ఎంత విద్యుత్ వినియోగించింది తెలియజేసే యాప్‌లు వచ్చాయని ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణలోని ప్లాంట్లకు ఎక్కువ బొగ్గును సింగరేణి నుంచే కేటాయించడం వల్ల రవాణా భారం తగ్గుతుందన్నారు. విద్యుత్ ఉత్పత్తి కోసం రాష్ట్రం చేపట్టిన పథకాలను కేంద్ర మంత్రి అభినందించారు.

గురువారం క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం
అందజేస్తున్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్