రాష్ట్రీయం

ఏపీది మొండి వాదన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 23: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొండిగా, నిరంకుశత్వంతో వ్యవహరించటం వల్లనే గురువారం జరిగిన సమావేశంలో కూడా ఎలాంటి స్పష్టత రాలేదని హరీశ్‌రావు చెప్పారు. వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్రం చేస్తున్న సూచనలను కూడా పట్టించుకోవటం లేదని ఆరోపించారు. గోదావరి జలాలను కృష్ణా నదికి మళ్లించే పక్షంలో పైరాష్ట్రాలకు హక్కులు ఏర్పడతాయని బచావత్ ట్రిబ్యునల్ స్పష్టంగా చెప్పినందున తమకు రావలసిన 90 టిఎంసిల నీటిని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు హరీశ్‌రావు చెప్పారు. బచావత్ అవార్డును అమలు చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు. జల సంఘం మాజీ అధ్యక్షులతో కమిటీని ఏర్పాటు చేస్తామని అమర్‌జీత్‌సింగ్ చేసిన ప్రతిపాదనను ఆమోదించినట్లు హరీశ్‌రావు వెల్లడించారు. ఈ మూడు నెలలపాటు యథాస్థితిని కొనసాగించాలన్న సూచనను కూడా తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిందని ఆయన చెప్పారు. దురదృష్టవశాత్తు ఏపి ప్రభుత్వం ఈ ప్రతిపాదనను ఆమోదించలేదని తెలిపారు.
కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలోని అన్ని ప్రాజెక్టులు అంటే తెలంగాణ, ఆంధ్రా, రాయలసీమలోని అన్ని ప్రాజెక్టులను కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకురావలసిందేనని హరీశ్‌రావు చెప్పారు. ఒకటి, రెండు ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తెచ్చేందుకు తెలంగాణ అంగీకరించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. కృష్ణానదికి సంబంధించిన ప్రతి నీటి చుక్కను లెక్కకట్టాలి, అప్పుడు రెండు రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ హక్కులను కోల్పోయేందుకు తాము సిద్ధంగా లేమని, అవసరమైతే కేంద్రంతో పోరాడతామని, సుప్రీం కోర్టుకు కూడా వెళతామని స్పష్టం చేశారు. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలోని అన్ని ప్రాజెక్టులను బోర్డు పర్యవేక్షణలోకి తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే అంతవరకు శ్రీశైలం ఏపి ప్రభుత్వం, నాగార్జునసాగర్ తెలంగాణ ప్రభుత్వం పర్యవేక్షణలో ఉంటాయని హరీశ్‌రావు చెప్పారు. ఏపి ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు తాము ఎల్లవేళలా సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు.