రాష్ట్రీయం

తెలంగాణ ఆగడాలపై కేంద్రానికి తెలిసొచ్చింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 23: కృష్ణాబోర్డు పరిధిని త్వరలోనే నోటిఫై చేస్తామని కేంద్ర జల వనరుల శాఖ అధికారులు తనకు హామీ ఇచ్చారని ఏపి నీటిపారుదల శాఖ మంత్రి ఉమామహేశ్వరరావు చెప్పారు. కృష్ణా నదీ జలాల వినియోగంపై తెలంగాణ, ఏపి మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు ఢిల్లీలో గత మూడు రోజుల నుండి జరుగుతున్న చర్చల వల్ల ఏపి ఎదుర్కొంటున్న ఇబ్బందులు కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చాయని ఆయన గురువారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. కృష్ణా బోర్డును అమలులోకి తెచ్చేందుకు అవసరమైన విధి విధానాలు రూపొందించేందుకు ముగ్గురు కేంద్ర జల సంఘం మాజీ అధ్యక్షులతో కమిటీని ఏర్పాటు చేయటం తమకు సమ్మతమేనని ఆయన చెప్పారు.
కేంద్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి అమర్‌జీత్ సింగ్ సమక్షంలో గురువారం మరోసారి తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుతో జరిపిన చర్చలు విఫలమయ్యాయని చెప్పారు. కృష్ణా బోర్డు పరిధిని నోటిఫై చేసేందుకు ముగ్గురు సిడబ్ల్యుసి మాజీ అధ్యక్షులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నారని ఆయన తెలిపారు. రాయలసీమ కరవు పీడిత ప్రాంతాలకు నీరందించేందుకు తెలంగాణ తాత్సారం చేస్తోందని వివరించినప్పడు కేంద్ర జలవనరుల శాఖ అధికారులు ఆశ్చర్యపోయారని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కెఆర్‌ఎంబి ఆదేశాలను కూడా పాటించటం లేదన్నారు. తాను ప్రస్తావించిన అంశాలకు హరీశ్‌రావు సమాధానం చెప్పలేకపోయారన్నారు. కేంద్ర జల సంఘం అధికారులకు ఇప్పుడు వాస్తవాలు అర్థమయ్యాయన్నారు. నాగార్జున సాగర్ కుడిగట్టు కాలువ గేట్లు ఏపి ప్రభుత్వ పరిధిలో ఉండాలనీ, తమ పోలీసుల అజమాయిషీ ఉండాలన్న తమ డిమాండ్‌ను తెలంగాణ ఒప్పుకోలేదని దేవినేని చెప్పారు. తెలంగాణకు కేటాయించిన నీటిలో ఒక్క చుక్క కూడా తమకు అవసరం లేదన్నారు. పోలవరంలో వచ్చే 80 టిఎంసిలలో భాగంగానే తెలంగాణలోని సింగూరు ప్రాజెక్టు 30 టిఎంసిలు, జూరాలకు పదిహేడు టిఎంసిలు అప్పుడే తీసుకున్నారని దేవినేని చెప్పారు. 1978లో మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా, జివి సుధాకరరావు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు బచావత్ ట్రిబ్యునల్ ప్రకారమే ఇది జరిగిందనేది హరీశ్‌రావుకు తెలియదా? అని ఆయన ప్రశ్నించారు. పోలవరం నుండి తమకు 45 టిఎంసిల జలాలు కావాలనటం మొండివాదనైతే, పట్టిసీమ ప్రాజెక్టుతో కలిపి 90 టిఎంసిల జలాలు తమకివ్వాలని హరీశ్‌రావు డిమాండ్ చేయటం తొండి వాదన అని ఆయన దుయ్యబట్టారు. ఆల్మట్టి ఎత్తు పెంచటం ద్వారా నల్గొండ, ఖమ్మం రైతాంగం హక్కులను దెబ్బతీస్తున్న కర్నాటకతో తెలంగాణ స్నేహం చేస్తుందా? అని ఆయన నిలదీశారు. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణంతో చుక్క నీరు రాకుండా చేస్తున్న మహారాష్టవ్రారు మీకు మిత్రులా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణతో చర్చలు జరిపేందుకు తాము ఎల్లప్పుడు సిద్ధమేననీ, కేంద్రం పిలిచినప్పుడు మళ్లీ ఢిల్లీకి వస్తామని ఆయన చెప్పారు.