రాష్ట్రీయం

రుణమాఫీకి 2190 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 25: వ్యవసాయ రుణ మాఫీ కింద మూడవ విడతగా ప్రభుత్వం 2,190 కోట్లు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. మొదటి రెండు విడతలతో కలిసి ఇప్పటి వరకు 10,626 కోట్లు విడుదల చేశారు. మొత్తం 16వేల కోట్ల వరకు రుణ మాఫీ అమలు చేయాల్సి ఉంది. మూడవ విడతలో నాలుగు వేల కోట్లు విడుదల చేయాల్సి ఉండగా, సగమే శనివారం విడుదల చేశారు. త్వరలోనే మిగిలిన సగం విడుదల చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో ఆర్థిక సహాయం అందితే ఒకేసారి మాఫీ అమలు చేయడానికి సిద్ధమేనని అసెంబ్లీలో సిఎం గతంలో ప్రకటించారు. పథకం అమలుకు ఆధార్ అనుసంధానం చేయడం, కొన్ని అవకతవకలు బయటపడడంతో విడుదల ఆలస్యమైంది.