రాష్ట్రీయం

పునరావాసానికి ఏర్పాట్లు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 25: పులిచింతల ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాస కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో పూర్తయ్యాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం గుంటూరులో జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్, ఎపి డబ్ల్యుఎస్‌ఐపి ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయాలను శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావుతో కలిసి మంత్రి దేవినేని ప్రారంభించారు. పులిచింతల ప్రాజెక్టు పునరావాస కార్యక్రమాలు ఏపిలో పూర్తికాగా నల్గొండలో పునరావాసానికి సంబంధించి నగదును అందజేశామని చెప్పారు. ప్రాజెక్టులో తొలివిడతగా 8 టిఎంసిల నీటిని నిల్వచేయగా 2వ సంవత్సరంలో 16 టిఎంసిల నీటిని నిల్వ చేయడం జరిగిందన్నారు. పులిచింతలకు సంబంధించి వివాదాలన్నీ త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు.