రాష్ట్రీయం

‘స్మార్ట్’గా పనిచేస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 25: స్మార్ట్ పట్టణాల రూపకల్పనలో ప్రధాని ఆలోచనలకు అనుగుణంగా నవ్యాంధ్ర ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. స్మార్ట్‌సిటీ మిషన్ ఆలోచనకు ఏడాది పూర్తయిన సందర్భంగా పలు ప్రాజెక్టులకు తుదిరూపునిచ్చిన పట్టణాలకు సంబంధించి ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహారాష్టల్రోని పుణె ఛత్రపతి శివాజీ స్టేడియం నుంచి ప్రధాని శనివారం ఈ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, విశాఖపట్నం మహా విశాఖ నగరపాలక సంస్థ (జివిఎంసి) నుంచి సిఎం చంద్రబాబు నేరుగా మట్లాడారు. స్మార్ట్‌సిటీ ప్రణాళికలను తాము ఇప్పటికే అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. డిజిటల్ ఇండియా ఆలోచనలో భాగంగా ఇప్పటికే నవ్యాంధ్రలో ఫైబర్ గ్రిడ్ ద్వారా రూ.150లకే 15 నుంచి 20 ఎంబిపిఎస్ వేగంతో ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తున్నట్టు వివరించారు. వచ్చే ఆగస్టు 15 నాటికి ఫైబర్‌గ్రిడ్ ద్వారా ఇంటర్నెట్ సేవలు విశాఖ ప్రజలకు అందించనున్నట్టు చంద్రబాబు తెలిపారు. విద్యుత్ స్తంభాల ద్వారానే రూ.375 కోట్ల అతితక్కువ ఖర్చుతో ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నట్టు తెలిపారు. స్మార్ట్‌సిటీ మిషన్‌లో భాగంగా అత్యాధునిక పరిజ్ఞానంతో అన్ని ప్రభుత్వ శాఖల సేవలను కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పరిధిలోకి తీసుకువస్తున్నట్టు వివరించారు. ప్రజా ఫిర్యాదుల నమోదు నుంచి పలు సేవలను ఈ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పరిధిలోకి తీసుకురానున్నట్టు తెలిపారు. తొలి దశలో ఫిర్యాదుల పరిష్కారంతోపాటు పర్యావరణం, వాతావరణం, భద్రత, నీటి సరఫరా, ఆస్తిపన్నులు సహా 10 సేవలను కమాండ్ సెంటర్ పరిధిలోకి తెచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. అలాగే ఖర్చును తగ్గించునే క్రమంలో ఎల్‌ఇడి వీధి దీపాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. హుదూద్ తుపాను కారణంగా దెబ్బతిన్న వాటిస్థానే 94వేల ఎల్‌ఇడి దీపాలను అమర్చడంతోపాటు వీటిని సెంట్రల్ కమాండ్ సిస్టంకు అనుసంధానించి పనితీరును గమనిస్తున్నట్టు వివరించారు. పూర్తిగా సేంద్రీయ విధానంలో సాగుచేస్తున్న అరకు కాఫీకి అంతర్జాతీయంగా మంచి మార్కెట్ ఉందని, దీనికి మరింత ప్రచారం కల్పించి విశాఖ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలుపుతామన్నారు.

చిత్రం ప్రధాని నరేంద్రమోదీతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు