రాష్ట్రీయం

మీ మేలు మరవను!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 25: అమరావతి ఓ శక్తిపీఠం లాంటిది.. శత్రు దుర్బేధ్యమైంది.. కుతంత్రాలు పనే్నవారికి తిరిగి వారి మెడకే చుట్టుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. శనివారం తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయంలో నేలపాడు రైతులకు ముఖ్యమంత్రి ప్లాట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగసభలో సిఎం మాట్లాడుతూ విభజన తరువాత ఇప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. చట్టప్రకారం ఆస్తులు పంపిణీకాలేదు.. విభజన చట్టాలను అమలు చేయలేదు.. నెత్తిన గంపెడు అప్పులతో వచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారని, వాటినే పెట్టుబడిగా పెట్టి ప్రపంచస్థాయి నగరాన్ని నిర్మించేందుకు అవకాశం లభించిందని వివరించారు. రైతుల నుద్దేశించి మాట్లాడుతూ మీ స్ఫూర్తి జీవితంలో మరువలేను.. గతాన్ని గుర్తుచేసుకుంటేనే భవిష్యత్తుకు ప్రణాళిక సిద్ధమవుతుందన్నారు.
వరద ముంపు నివారణలో భాగంగా కొండవీటి వాగుపై రిజర్వాయర్ల నిర్మాణంతోపాటు వరద నీటిని కృష్ణానది, కృష్ణా పశ్చిమ కాల్వలకు మళ్లిస్తామని వివరించారు. రాజధాని ప్రతిపాదిత 29 గ్రామాల్లో అంతర్గత జల రవాణాను అభివృద్ధి చేయటంతోపాటు ఇతర రాష్ట్రాలకు జలరవాణా వ్యవస్థను పునరుద్ధరిస్తామని వెల్లడించారు. కార్గో ఎగుమతుల కేంద్రంగా అమరావతిని అభివృద్ధి పరుస్తామని తెలిపారు. స్విస్ చాలెంజ్ పద్ధతి ద్వారా రాజధానిలో వౌలిక వసతులు కల్పిస్తే రైతుల భూములకు ధర పెరుగుతుందని ఈ రకంగా వారి రుణం తీర్చుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మహిళలు కూడా ఆర్థిక సాధికారత సాధించాలనే ఆకాంక్ష వ్యక్తం చేశారు. నూతన రాజధాని నిర్మాణంలో భగవంతుని ఆశీస్సులతోపాటు తన సంకల్ప బలం ఉందని ఉద్ఘాటించారు. రాజధాని రైతులెవరికీ అన్యాయం జరగదని భరోసా ఇచ్చారు. ఇప్పటివరకు రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారు. రాజధాని అవసరాలకు ఇంకా కొంత సేకరించాల్సి ఉంది. విపక్ష పార్టీ రైతుల్ని రెచ్చగొడుతోంది..ఇక ఉపేక్షించేదిలేదు.. ఈ రోజు నుంచే భూ సేకరణ ప్రారంభిస్తాం.. అక్టోబర్ కల్లా పూర్తిస్థాయిలో భూములు సేకరిస్తామని స్పష్టం చేశారు. సేకరణ వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. రైతులు ఆలోచించుకుని స్వచ్ఛందంగా అందించాలని కోరారు. నేలపాడు గ్రామంలో 847 మంది రైతులకు 1916 ప్లాట్లను లాటరీ ద్వారా కేటాయించారు. కమర్షియల్ ప్లాట్లను రాండమైజేషన్ పద్ధతిలో చేపట్టామని తెలిపారు. రైతుల ప్లాట్లకు త్వరలో అన్నిరకాల వౌలిక వసతులు కల్పిస్తామన్నారు. రాజధానికి 3.5 ఎకరాల భూమిని స్వచ్ఛందంగా అందజేసిన నేలపాడుకు చెందిన తొలి మహిళ కొమ్మినేని ఆదిలక్ష్మికి తొలి ప్లాటును అందజేశారు. కార్యక్రమంలో మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు, పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, డిప్యూటీ సిఎం నిమ్మకాయల చినరాజప్ప తదితరులు పాల్గొన్నారు.

చిత్రం రాజధానికి భూమినిచ్చిన నేలపాడు తొలి మహిళ కొమ్మినేని ఆదిలక్ష్మికి ప్లాటు అందజేస్తున్న ముఖ్యమంత్రి