రాష్ట్రీయం

ఐఐటిల్లో ప్రవేశాలకు షెడ్యూలు ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 25: జెఇఇ మెయిన్ అఖిల భారత స్థాయి ర్యాంకులు విడుదల కావడంతో ప్రవేశాలకు షెడ్యూలు ఖరారైంది. ఈ నెల 28వ తేదీ వరకూ విద్యార్థులు తమ వెబ్ ఆప్షన్లు ఇచ్చేందుకు జాయింట్ సీట్ కేటాయింపు అథారిటీ చర్యలు చేపట్టింది. 30న మొదటి దశ సీట్లను కేటాయించనుంది. మొత్తం నాలుగు దశల్లో సీట్ల కేటాయింపు, ప్రవేశాలు చేపడతారు. ఈ కౌనె్సలింగ్ ద్వారా 23 ఐఐటిలు, ఒక ఐఎస్‌ఎం, 31 ఎన్‌ఐటిలు, 18ఐఐఐటిలు, మరో 18 కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక విద్యాసంస్థల్లో మొత్తంగా 69,790 సీట్లను భర్తీ చేస్తారు. 27 నుండి సీట్ల నమూనా కేటాయిస్తారు. 30న తొలి విడత సీట్ల కేటాయింపు జరుగుతుంది. నాలుగైదు రోజుల పాటు సీట్ల ఆమోదానికి అవకాశం కల్పిస్తారు. తర్వాత రోజున భర్తీ అయిన సీట్లు, ఖాళీ సీట్ల వివరాలు ప్రకటిస్తారు. రెండో దశ సీట్ల కేటాయింపు జరుగుతుంది. సీట్ల ఆమోదం లేదా ఉపసంహరణకు రెండు లేదా మూడు రోజుల సమయం పడుతుంది. రెండో దశ సీట్ల ఆమోదం తర్వాత భర్తీ అయిన, మిగిలి పోయిన సీట్ల వివరాలు కూడా ప్రకటిస్తారు. తర్వాత మూడో దశ సీట్ల కేటాయింపు జరుగుతుంది. సీట్ల ఆమోదం, ఉపసంహరణకు రెండు లేదా మూడు రోజుల సమయం పడుతుంది. మూడోదశ సీట్ల ఆమోదం తర్వాత భర్తీ అయిన, మిగిలిపోయిన సీట్ల వివరాలు ప్రకటిస్తారు. తర్వాతి రోజున నాలుగో దశ సీట్ల కేటాయింపు జరుగుతుంది, తర్వాత ఒకటి లేదా రెండు రోజుల పాటు సీట్ల ఆమోదానికి గడువు ఇస్తారు.