రాష్ట్రీయం

భారీగా విదేశీ మద్యం స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 25: నగరంలోని వివిధ ప్రాంతాల్లో శనివారం ఆకస్మిక దాడులు నిర్వహించిన ఎక్సైజ్ అధికారులు భారీగా విదేశీ మధ్యం స్వాధీనం చేసుకున్నారు. మంగళ్‌హాట్, గాంధీనగర్, మీర్‌చౌక్, నారాయణగూడలో దాడులు నిర్వహించిన ఎక్సైజ్ సిబ్బంది రూ.1.71 కోట్ల విలువైన 7,255 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ బూదాటి రాధాకృష్ణయ్య అలియాస్ రాధయ్యతోపాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. మద్యం సీసాలు ఉక్రెయిన్ నుంచి తీసుకొచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. గతంలో రాధయ్య ఆర్టీసీ పాలకవర్గ సభ్యుడిగాను, కార్మిక సంఘం నేతగాను పనిచేశారు.