రాష్ట్రీయం

పరిశ్రమలకు విద్యుత్ రాయితీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 27: సంక్షోభంలో ఉన్న పరిశ్రమలను గట్టెక్కించే ప్రయత్నంలో విద్యుత్ రాయితీలు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమ, ఉక్కు పరిశ్రమ యాజమాన్యాలకు, ఆ కంపెనీల్లో పని చేసే కార్మికులకు ఊరటనిచ్చే విధంగా సిఎం కెసిఆర్ రాయితీలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. స్పిన్నింగ్ మిల్లులు ప్రస్తుతం యూనిట్‌కు చెల్లించే 6.40 చారిలో రెండు రూపాయలు తగ్గించి 4.40 ధర నిర్ణయంచారు. పెర్రో అల్లాయిస్ పరిశ్రమల్లో యూనిట్ విద్యుత్ ధర 5.30 ఉంటే, రూపాయిన్నర తగ్గిస్తూ 3.80గా ఖరారు చేస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీశ్ శర్మ, అదనపు కార్యదర్శి శాంతి కుమారిలతో జరిగిన సమావేశంలో సిఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని వివిధ స్పిన్నింగ్ మిల్లుల్లో దాదాపు 40వేల మంది, పెర్రో అల్లాయిస్ పరిశ్రమల్లో దాదాపు ఐదువేల మంది కార్మికులు పని చేస్తున్నారు. విద్యుత్ చార్జీలు పెంపుదల వల్ల పరిశ్రమపై తీవ్రమైన భారం పడుతుందని ఈ పరిశ్రమ వర్గాలు ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చాయి. వీరి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, సంక్షోభంలో ఉన్న పరిశ్రమకు ఊరట కలిగించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ విద్యుత్ రాయితీలు ఏడాది పాటు కొనసాగుతాయి. తరువాత పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచిన విషయం తెలిసిందే. ఈ పెంపుదల భారం తమపై ఎక్కువగా పడుతుందని పరిశ్రమ వర్గాలు ప్రభుత్వానికి తెలిపాయి.