రాష్ట్రీయం

9335 మంది విద్యావలంటీర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 27: రాష్టవ్య్రాప్తంగా పలు పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఖాళీలను దృష్టిలో పెట్టుకుని 9335 మంది విద్యా వాలంటీర్లను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యా వాలంటీర్ల నియామకానికి సిఎం కెసిఆర్ సోమవారం ఆమోదం తెలిపారు. క్యాంపు కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరితో పాటు విద్యాశాఖకు సంబంధించిన సమస్యలపై చర్చించారు. ఉపాధ్యాయుల కొరత ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చింది. ఆయా జిల్లాల కలెక్టర్ల ద్వారా తాత్కాలిక నియామక పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని నిర్ణయించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రెగ్యులర్ టీచర్ల నియామకం చేసేంత వరకు విద్యావాలంటీర్లు కొనసాగుతారు. విద్యా వాలంటీర్లను ప్రస్తుత విద్యా సంవత్సరం కోసం మాత్రమే నియమిస్తున్నట్టు అధికార ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉంది. గతంలో డిఎస్‌సి ద్వారా ఉపాధ్యాయుల నియామకం జరిగేది. రాష్ట్రంలో అన్ని ఉద్యోగాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈసారి డిఎస్సీ నిర్వహించకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టేందుకు చర్యలు తీసుకున్నారు.
ఏడాది క్రితమే డిఎస్‌సి నిర్వహించాల్సి ఉంది. డిఎస్‌సి ద్వారా కానీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా కానీ ఉపాధ్యాయుల నియామకం చేపట్టక పోవడం వల్ల ఈ విద్యా సంవత్సరం పాఠశాల్లో ఉపాధ్యాయలు లేక ఇబ్బంది తలెత్తే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యా వాలంటీర్లను నియమించాలని నిర్ణయించారు. ఆయా జిల్లాలో ఉపాధ్యాయ ఖాళీలు, అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆ జిల్లా కలెక్టర్లే విద్యా వాలంటీర్లను నియమిస్తారు.

చిత్రం విద్యాశాఖ మంత్రి, ఉన్నత అధికారులతో వలంటీర్ల నియామకంపై సమీక్షిస్తున్న సిఎం కెసిఆర్