రాష్ట్రీయం

ఫార్మాకు ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 27: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపపట్టిన ఫార్మా సిటీలో 1500 కోట్ల ఖర్చుతో ప్రపంచస్థాయి కామన్ అఫ్లూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ అంగీకరించినట్టు రాష్ట్ర ఐటీ మంత్రి కె తారక రామారావు వెల్లడించారు. ఇందులో భాగంగా తొలివిడత కింద 200 కోట్ల నిధులు తక్షణ విడుదలకు ఆదేశించారన్నారు. మంత్రి కెటిఆర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా సోమవారం కేంద్ర మంత్రి నిర్మలా సీరామన్‌ను కలిసి ఫార్మా ట్రీట్‌మెంట్ ప్లాంట్‌కు ఆర్థిక సాయం కోరారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న పార్టీ సిటీ విషయాన్ని వివరించారు. ప్రపంచస్థాయి ట్రీట్‌మెంట్ ప్లాంట్ వివరాలు తెలుసుకున్న మంత్రి, ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు రావడంతోపాటు తక్షణం 200 కోట్లు విడుదల చేసేందుకు అంగీకరించారని కెటిఆర్ మీడియాకు వెల్లడించారు. తెలంగాణకు సంబంధించిన పలు ప్రతిపాదనలను కేంద్ర మంత్రికి వివరించామన్నారు. వరంగల్‌లో నెలకొల్పనున్న టెక్స్‌టైల్ పార్క్‌లోనూ ఒక కామన్ అఫ్లూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు అందిస్తే పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారన్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల సెజ్‌లకు ఒకే కమిషనర్ ఉన్నారని, తెలంగాణలో ఎక్కువ సెజ్‌లు ఉన్నందున ప్రత్యేకంగా కమిషర్ కార్యాయలం ఏర్పాటు చేయాలన్న విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారన్నారు. అలాగే రాష్ట్రానికి రెండు మల్టీ ప్రోడక్ట్ సెజ్‌లు మంజూరు చేయాలని కోరామన్నారు. కేంద్రం మల్టీ ప్రోడక్ట్ సెజ్‌లను మంజూరు చేస్తే, తెలంగాణ చేపట్టనున్న డ్రైపోర్టును ఒకేచోట పెట్టాలని యోచిస్తున్నట్టు మంత్రి వివరించామన్నారు. దీనివలన దిగుమతి వస్తువులకు అనుకూలంగా ఉంటుందన్నారు.
జావడేకర్‌తో భేటీ
ఫార్మా సిటీ నిర్మాణానికి త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రి ప్రకాశ్ జావడేకర్‌కు విజ్ఞప్తి చేశామన్నారు. సోమవారం సాయంత్రం జావడేకర్‌ను ఆయన కార్యాలయంలో కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, అనుమతులు మంజూరుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. ఆదిలాబాద్‌లోని జిన్నారం, నిర్మల్ ప్రాంతంలో ఇనుప ఖనిజాలు ఉన్నాయని భారతీయ భూగర్భ శాఖ చెబుతున్నందున, ఈ ప్రాంతంలో తవ్వకాలకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని కోరామన్నారు. హైదరాబాదులో గాలి నాణ్యతను తెలిపే డిజిటల్ బోర్డు ఏర్పాటుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందించాలని మంత్రిని కోరామన్నారు. రాష్ట్రంలో అమలవుతోన్న హరితహారాన్ని జావడేకర్ ప్రశంసించారన్నారు. హరితహారం రెండో విడత కార్యక్రమానికి హాజరయ్యేందుకు అంగీకరించారన్నారు. జూలై 11న 25 లక్షల మొక్కలు నాటిస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చినట్టు కెటిఆర్ చెప్పారు.
ఆరోగ్య శాఖ నడ్డాతో..
హైదరాబాద్‌లో జాతీయ డ్రగ్ కంట్రోల్ అకాడమీ ఏర్పాటు అంశం పరిశీలనకు అధికారుల బృందాన్ని పంపేందుకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రి జెపి నడ్డా అంగీకరించారని కెటిఆర్ వివరించారు. డ్రగ్ కంట్రోల్ అకాడెమీ ఏర్పాటు అంశంపై సోమవారం నడ్డాతో చర్చించిన కెటిఆర్, ఇండియన్ ఫార్మా కోపీ అసోసియేషన్ ప్రాంతీయ కార్యాలయాన్నీ హైదరాబాదులో ఏర్పాటు చేయాలని కోరామన్నారు. హైదరాబాద్‌లో డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఏర్పాటుకు అవసరమయ్యే భూమిని ఉచితంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించామన్నారు. ఫార్మా సిటీతోపాటు ప్రపంచస్థాయి ప్రమాణాలతో జాతీయ డ్రగ్ కంట్రోల్ అథారిటీ, ఫార్మా కోపీ అసోసియేషన్ ఏర్పాటువల్ల ఫార్మా సంస్థలకు ఎంతో మేలు కలుగుతుందని కెటిఆర్ వివరించారు.

చిత్రం ఫార్మా సిటీ అభివృద్ధికి నిధులు కోరుతూ కేంద్ర మంత్రులు సీతారామన్, జవడేకర్‌ను కలిసిన మంత్రి కెటిఆర్