రాష్ట్రీయం

ఈ-హుండీ కానుకలకు పేమెంట్ గేట్‌వే చార్జీలు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 27: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ఈ-హుండీ ద్వారా కానుకలు సమర్పించే భక్తులకు పేమెంట్ గేట్ వే చార్జీలు (కమిషన్ చార్జీలు) రద్దు చేయడానికి చర్యలు తీసుకోవాలని టిటిడి కార్యనిర్వహణాధికారి డాక్టర్ డి.సాంబశివరావు అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనాభవనంలో సోమవారం సీనియర్ అధికారులతో ఇఓ వారాంతపు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇఓ మాట్లాడుతూ సుదూర ప్రాంతాల్లోని భక్తులు తిరుమల శ్రీవారి ఆలయానికి విచ్చేసి కానుకలు సమర్పించుకోలేని వారికి ఈ-హుండీ ద్వారా కానుకలు సమర్పించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. భక్తులు పేమెంట్ గేట్ వే ద్వారా కానుకలు సమర్పించుకొనే సందర్భంలో కొంత మొత్తం చార్జీలు చెల్లించవలసి వస్తోంది. దీనిని వెంటనే రద్దుచేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోనే కాక దేశ వ్యాప్తంగా ఉన్న టిటిడి కల్యాణ మండపాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాటుచేసిన అధికారుల కమిటీ త్వరితగతిన తమ నివేదిక సమర్పించాలని ఇఓ ఆదేశించారు. ధర్మప్రచారంలో భాగంగా టిటిడి అందిస్తున్న పంచలోహ విగ్రహాలు కావాలని వినతిపత్రాలు అందిన వెంటనే త్వరితగతిన అందించాలని అధికారులను ఆదేశించారు. తిరుమలలో చిరుతల సంచారానికి సంబంధించి అటవీశాఖ వారితో సమన్వయం చేసుకొని పులులు జన సంచారంలోకి రాకుండా తగు చర్యలు తీసుకోవాలని డిఎఫ్‌ఓను ఆదేశించారు.

చిత్రం టిటిడి ఇఓ సాంబశివరావు