రాష్ట్రీయం

బాలుడి ప్రాణం తీసిన ప్లాస్టిక్ కవర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ కెపిహెచ్‌బి కాలనీ, జూన్ 29: నాలుగు సంవత్సరాల వయస్సు ఉన్న బాలుడు తలకు కవర్ తగిలించుకొని ఆడుకుంటూ ఊపిరి ఆడక మరణించిన విషాదకర సంఘటన హైదరాబాద్‌లోని కెపిహెచ్‌బి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా నర్సరావుపేటకు చెందిన కోడెల శ్రీనివాసబాబు దంపతులు నిజాంపేట రోడ్డులో నివాసముంటున్నారు. వీరికి 4 సంవత్సరాల బాబు శ్రీయాన్ ఉన్నాడు. మంగళవారం సాయంత్రం స్కూల్ నుండి వచ్చిన శ్రీయాన్ తల్లి వంట పనిలో నిమగ్నమై ఉండగా ఇంట్లో ఉన్న డిమార్ట్ ప్లాస్టిక్ కవర్‌ను తలకు తగిలించుకొని ఆడుకుంటూ బెడ్‌రూమ్‌లోకి వెళ్తుండగా కవర్ అతని తలకు ఇరుక్కుపోయింది.
అదే సమయంలో బెడ్‌రూమ్ డోర్ మూసుకొని లాక్ పడిపోయింది. దీంతో బాలుడు బాధతో కేకలు పెట్టాడు. అయితే ఆటలో భాగంగా అరుస్తున్నాడని అనుకొని పనిలో నిమగ్నమైన తల్లి దానిని పట్టించుకోలేదు. కొద్దిసేపటికి డోర్ తీసి చూడగా బాబు తలకు కవర్ బిగుసుకుపోయి ఉండి ఊపిరి ఆడక అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని గమనించింది. దీంతో బాబును హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా శ్రీయాన్ చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. కాగా శ్రీనివాస్‌బాబుకు వివాహమైన రెండు సంవత్సరాల అనంతరం సంతానం కలగడంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న బాలుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.