రాష్ట్రీయం

ఖరీఫ్‌లో రిలీఫ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 30: కోస్తా నేలల్లో కొత్త వరి వంగడాలు అంకురిస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి ముందస్తు చర్యగా శాస్తవ్రేత్తలు ఈ వంగడాలను సిద్ధం చేశారు. దశాబ్దాలుగా రైతులు అలవాటు పడిన స్వర్ణ, సోనా మసూరికి ప్రత్యామ్నాయంగా వీటిని ఆవిష్కరించారు. ఈ ఖరీఫ్ నుంచే కోస్తా నేలలకు వీటిని పరిచయం చేస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు, వరదలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనికి తోడు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మాసాల్లో అత్యధిక వర్షాలు ఉంటాయని కూడా అంచనా వేసింది. ఈ మాసాల్లో వరి పాలు పోసుకుని గింజగట్టిపడే దశలో ఉంటుంది. ఆ సమయంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో దాదాపు 30 ఏళ్లుగా రైతులు అలవాటు పడిన స్వర్ణ, సోనా రకాలను వేస్తే నష్టం అధికంగా ఉంటుందని అంచనా వేశారు. అందుకే ఎటువంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకునే విధంగా దిగుబడిలో స్వర్ణకు దీటైన రకాలను మార్టేరు వ్యవసాయ పరిశోధనా సంస్థ శాస్తవ్రేత్తలు ఆవిష్కరించారు. ఈ వంగడాలను ప్రభుత్వం సిఫార్సు చేయడంతో ఖరీఫ్‌లో కోస్తా నేలల్లో సాగుకు సిద్ధం చేశారు. ప్రస్తుత వంగడాలతో అనేక విధాలుగా నష్టపోతున్న రైతులకు ఈ కొత్త వంగడాలు ధీమానిస్తాయని చెబుతున్నారు. ఈ నేపధ్యంలో స్వర్ణకు ప్రత్యామ్నాయంగా ఎంటియు 1061, ఎంటియు 1064, ఎంటియు 1075 రకాలు ప్రవేశపెట్టారు. ఈ వంగడాలను రైతులకు అలవాటు చేసేందుకు సబ్సిడీపై కూడా సరఫరా చేశారు. రైతులు గత మూడు దశాబ్దాలుగా ఖరీఫ్‌లో స్వర్ణ సాగుకు అలవాటుపడ్డారు. దీన్ని అంత త్వరగా వదులుకునే పరిస్థితి లేదు. అయినప్పటికీ రానున్న వర్షాలు, వరదలను దృష్టిలో పెట్టుకుని ఈ కొత్త వంగడాలను సాగుచేయాలని వ్యవసాయ శాఖ రైతులను ఒప్పించడంతో అత్యధిక విస్తీర్ణంలో స్వర్ణకు ప్రత్యామ్నాయంగా కొత్త వంగడాలు ఈ ఖరీఫ్‌లో ఆక్రమిస్తున్నాయి. కొత్తగా ప్రవేశపెట్టిన ఎంటియు 1064, 1065, 1061 రకాలు గాలి, వాన, వరదలకు తట్టుకుని నిలబడుతుందని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. అదే విధంగా సోనా మసూరికి ప్రత్యామ్నాయంగా ఆర్‌సి బయో 226 రకాన్ని ప్రవేశపెట్టారు. విత్తనాలు కిలోకు రూ.5 సబ్సిడీ అందించి, గత కొంత కాలంగా ఈ వెరైటీ సాగుకు వ్యవసాయ శాఖ అధికారులు ఆత్మ పథకంలో కృషి చేస్తున్నారు.