రాష్ట్రీయం

ఫేస్ ‘బుక్’చేస్తారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 30: అభ్యున్నతికి, పురోగతికి తోడ్పడే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఐఎస్‌ఐఎస్ లాంటి ఉగ్రవాద సంస్థలకు ఓ వరంలా మారింది. పాలకులు, పోలీసుల నిర్లక్ష్యం కారణంగా ఈ ఆధునిక సౌకర్యం పెడదోవపడుతోంది. రోజురోజుకి అభివృద్ది చెందుతోన్న సాంకేతిక పరిజ్ఞానంతో ఉగ్రవాదులు తమ భావాజాలాన్ని ప్రచారం చేసుకునేందుకు, యువతను ఆకర్షించేందుకు ఎంతో చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఒక్క క్లిక్‌తో ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో క్షణాల్లో తెలుసుకోగల్గుతున్నాం. సమాచారం, సౌకర్యంతో స్నేహితులతో కాస్త ఉల్లాసంగా చిట్‌చాట్ చేసేందుకు విద్యార్థులు, సాధారణ ప్రజలు, మొదలుకుని విద్యావేత్తలు, ఉద్యోగులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ ఫేస్‌బుక్‌ను వినియోగిస్తున్నారు. ఎవరి ఖాతాలు వారికి పాస్‌వర్డ్‌ల సహాయంతో గోప్యంగా ఉండటంతో ఇదే చక్కటి మార్గంగా ఎంచుకుంది ఈ ఉగ్రవాద సంస్థ. నగరంలో భయంకరమైన విధ్వంసాన్ని సృష్టించేందుకు కొందరు ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు చేసిన కుట్రను భగ్నం చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) వారిని విచారించి, ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెలుగులోకి తెచ్చింది. మతం పట్ల ఉన్న అభిమానాన్ని కాస్త ఉగ్ర సంస్థలు రెచ్చగొట్టే సాహిత్యంతో మతోన్మాదంగా మారుస్తోంది. యువకులు, ఐఎస్‌లో చేరాలనుకునే సానుభూతిపరులు ఈ ఫేస్‌బుక్ ద్వారా వ్యవహారాల్ని నడుపుతూ ఉగ్రవాదం వైపు ఆకర్షితులవుతున్నారు. కాగా, వీరిలో ఎక్కువ మందిని మత ప్రాతిపదికనే ఐఎస్‌ఎస్ టార్గెట్ చేసుకుని, వారి వయస్సుకు తగిన విధంగా వారు త్వరగా తమవైపు ఆకర్షితులయ్యేలా సాహిత్యాన్ని వారికి పంపుతూ, వారు ఎంత వరకు వాటికి ఆకర్షితులయ్యారన్న విషయాన్ని తెలుసుకునేందుకు ఎంతో పకడ్బందీగా, పక్కా ప్లాన్‌తో క్రాస్ ఎగ్జామ్ కూడా చేసుకుంటూ యువకులను ఎంచుకుంటోంది. అంతేగాక, మరికొందరు యవకులను ఎంతో మేథస్సు ఉండి, తగిన గుర్తింపు లేక సామాన్యమైన జీవితాలు గడుపుతున్నారంటూ, తమవైపు రాగలిగితే మంచి గుర్తింపుతో పాటు విలాసవంతమైన జీవితాన్నిస్తామని ఆకర్షితులను చేస్తున్నట్లు సమాచారం. ఐఎస్‌ఐఎస్‌లో చేరుతున్న వారిలో ఎక్కువ మంది ఈరకంగా ఆకర్షితులైన వారే ఉన్నారు. మరికొందరు పరోక్షంగా ఐఎస్‌ఐఎస్‌కు ఏజెంట్లుగా పనిచేస్తూ సంబంధాలను కొనసాగిస్తున్నారు. యువకులు మాత్రమే గాక, యువతులు కూడా ఆకర్షితులు కావటం గమనార్హం. ప్రత్యేకంగా తెలంగాణ నుంచి వెళ్లే వారు టర్కీ నుంచి సిరియాలోకి ప్రవేశించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం పాతబస్తీకి చెందిన ఓ యువతి టర్కీ గుండా సిరియా వెళ్లేందుకు యత్నించగా, గుర్తించి ఆమెకు కౌనె్సలింగ్ ఇచ్చారు. ఇటీవల ఖమ్మం, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన కొందరు యువకులు టర్కీ నుంచి సిరియా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా ఫేస్‌బుక్ ద్వారా ఐఎస్ పట్ల ప్రభావితులై, వెళ్తున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ గుర్తించింది. అంతేగాక, వీరిలో ఎక్కువ మంది విద్యావంతులు, ఐటిపై పట్టు, బాంబులు తయారు చేయగలిగే మేథస్సున్న వారే ఉండటం ఐఎస్‌ఐఎస్ క్రూర ఆలోచనకు, భయంకర విధ్వంస రచనకు నిదర్శనం.
పక్కాగా..పకడ్బందీగా!
ఫేస్‌బుక్‌లోకి వెళ్లి ఇతరులను ఫ్రెండ్ చేసుకోవటం సాధారణం. అయితే ఇందులో ఒక వర్గానికి చెంది నిరుద్యోగులైన విద్యావంతులు, కుటుంబ ఆర్థిక స్తోమత సక్రమంగా లేని వారిని ఎంపిక చేసుకుంటుంది ఐఎస్‌ఐఎస్. వీరికి తొలుత మతం ఎంత మమకారం..దేశం పట్ల ఏ రకమైన ద్వేషం ఉందన్న విషయాల్ని సాధారణంగా చిట్‌చాట్ చేస్తూ అంచనా వేస్తున్నట్లు తెలిసింది. ఆ తర్వాత వేర్వేరు ఫేస్ బుక్‌లతో స్నేహితులుగా ఉగ్రవాదంపై అభిప్రాయం తెల్సుకుని అభిరుచులు కలుపుకోవటం వంటివి చేసిన తర్వాత ఆకర్షితుడైన యువకుడు నిజంగా తమకు పనికొస్తాడా? లేడా? అన్న విషయాన్ని క్రాస్ చేసుకునేందుకు ఇప్పటి వరకు సంబంధం నెరపిన ఫేస్‌బుక్ ఐడికి పూర్తిగా వ్యతిరేక భావాలున్న మరో ఐడితో పరిచయమై పరీక్షిస్తారు. యువకుడు నిజాంగానే ఆకర్షితుడైనట్టు నిర్థారించుకున్న తర్వాత మెల్లిగా ఐఎస్‌ఐఎస్ కార్యకలాపాలను బయటపెడుతారు. ఈ రకంగా ఆకర్షితులై సిరియా వెళ్లేందుకు ప్రయత్నించి పోలీసులకు చిక్కారు.
పోలీసుల గస్తీ ఏ పాటిది?
సోషల్ మీడియా ద్వారా యువతకు గాలం వేసి, వారిని ఆకర్షితులను చేసుకుంటున్న ఐఎస్‌ఐఎస్ సానుభూతుపరులు నగరంలో భారీ విధ్వంసాన్ని సృష్టించేందుకు పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట, బండ్లగూడ ప్రాంతాల్లో ఏకంగా బాంబులు పేలుస్తూ, గన్‌లతో కాల్పులు జరుపుతూ బహిరంగంగా ప్రాక్టీస్ చేసినా పోలీసులు వారిని గుర్తించకపోవటం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రియల్టర్లు, పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీలను హత్య చేసేందుకు ప్రణాళిక చేసే వారిని ముందస్తుగా గుర్తించే సామర్థ్యం ఉన్న పోలీసులకు ఉగ్ర సానుభూతి పరులు బహిరంగంగా చేసిన ప్రాక్టీసు కళ్లకు కనబడకపోవటం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.