రాష్ట్రీయం

ఉచితంగా డయాలసిస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జూన్ 30: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో క్యాన్సర్ సెంటర్లను ప్రారంభించటమే కాకుండా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తుల కోసం డయాలసిస్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కె.లక్ష్మారెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ డయాలసిస్ కేంద్రాలలో ఉచితంగా డయాలసిస్ చేయడం జరుగుతుందని వివరించారు. శుక్రవారం ఖమ్మం జిల్లా ప్రధానాసుపత్రిలో క్యాన్సర్ సెంటర్‌ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఖమ్మంలో తొలుత ప్రారంభించిన ఈ సెంటర్ల మాదిరిగానే అన్ని జిల్లా కేంద్రాల్లో క్యాన్సర్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కేంద్రాల్లో పరీక్షలు, చికిత్సతో పాటు మందులు కూడా ఉచితంగా అందిస్తామన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ వైద్య ఆరోగ్య శాఖకు అధిక నిధులు కేటాయిస్తున్నారని, దీనిని వినియోగించుకొని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రయత్నిస్తామన్నారు. ప్రభుత్వం ప్రారంభించే పథకాలన్ని ప్రజల వద్దకు చేరాలంటే సిబ్బందిదే బాధ్యత అని, అలాగే ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు త్వరలో ఆ శాఖలో ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేస్తామన్నారు. వైద్యులు తాము పని చేసే చోటే ఉండాల్సిన బాధ్యతను గుర్తు చేశారు. అనంతరం వారు ఆసుపత్రిలో రోగులతో మాట్లాడి ఆసుపత్రిలో సేవలు, సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు.