రాష్ట్రీయం

40వేల మంది గైర్హాజరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 1: తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్లకు జరుగుతున్న కౌనె్సలింగ్‌లో ఇంత వరకూ 1,04,500 మంది హాజరుకావల్సి ఉన్నా కేవలం 63777 మంది మాత్రమే హాజరయ్యారు. ఎమ్సెట్‌లో 1,04,500 మంది అర్హత సాధించారు. 80వేల ర్యాంకు వరకూ 50,563 మంది హాజరుకాగా, 80001 నుండి 92000 ర్యాంకు వరకూ కేవలం 6953 మంది హాజరయ్యారు. 92001 ర్యాంకు నుండి 1,04,500 ర్యాంకు వరకూ 6631 మంది హాజరయ్యారు. అంటే కేవలం సర్ట్ఫికేట్ల పరిశీలనకే 40723 మంది గైర్హాజరయ్యారు. వెబ్ ఆప్షన్లలో కూడా సర్ట్ఫికేట్ల పరిశీలనకు హాజరైన వారంతా దరఖాస్తు చేస్తారనే నమ్మకం కూడా లేదని ఒక సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. కాగా మరో పక్క జూలై 5వ తేదీ నుండి వెబ్ ఆప్షన్లకు సాంకేతిక విద్యాశాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇంత వరకూ జరిగిన సర్ట్ఫికేట్ల పరిశీలనకు హాజరుకాని వారికి సైతం మరో అవకాశం కల్పించారు. అటువంటి వారంతా జూలై 5, 6 తేదీల్లో సర్ట్ఫికేట్ల పరిశీలనకు హాజరుకావచ్చు. 5, 6 తేదీల్లో 1 నుండి 45వేల ర్యాంకు వరకూ అభ్యర్థులు తమ వెబ్ ఆప్షన్లను నమోదుచేయాలి, 7,8 తేదీల్లో 45001 నుండి 90 వేల ర్యాంకు వరకూ, 9వ తేదీన 90001 నుండి చివరి ర్యాంకు వరకూ అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేయాలి. 10వ తేదీన వెబ్ ఆప్షన్లను మార్చుకునేందుకు వీలుకల్పిస్తారు. 14వ తేదీన సీట్ల కేటాయింపు జరుగుతుంది. స్పెషల్ కేటగిరి అభ్యర్థులు 5,6 తేదీల్లో సాంకేతిక విద్యా భవన్‌లో హాజరుకావల్సి ఉంటుంది.
విద్యారంగంలో వివిధ సీట్ల కేటాయింపులో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే కౌనె్సలింగ్ నిర్వహించాలని గిరిజన విద్యార్థి సమాఖ్య (టిఎస్‌ఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూడ్ శోభన్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.