రాష్ట్రీయం

అనర్హత పిటిషన్లు తిరస్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 2: పార్టీ మారిన 13 మంది వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభ్యులపై ఆ పార్టీ సభ్యులు ఇచ్చిన అనర్హత పిటిషన్లను తిరస్కరించినట్లు శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు వెల్లడించారు. ఎన్నికల్లో తాను 11 కోట్లు ఖర్చు చేశానన్న ఆరోపణలను త్రోసిపుచ్చారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. వైసీపీ ఎమ్మెల్యేలుగా ఎన్నికయి, తెలుగుదేశం పార్టీలో చేరిన జ్యోతుల నెహ్రూ, సుజయకృష్ణ రంగారావు, డేవిడ్‌రాజు, భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియ, జలీల్‌ఖాన్, జయరాములు, వరుపుల సుబ్బారావుతదితర 13 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ అమర్‌నాథ్‌రెడ్డి, ముస్త్ఫా ఇచ్చిన ఫిర్యాదులు పరిశీలించామని కోడెల వివరించారు. అయితే, అవి రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా లేవని, అందుకే వాటిని సాంకేతిక కారణాలతో తిరస్కరించానని స్పీకర్ వెల్లడించారు. కడప జిల్లా ఎమ్మెల్యే రఘురామిరెడ్డి రాజీనామా చేశారన్న విషయాన్ని ప్రస్తావించగా, ఆయన రాజీనామా లేఖ ఇంకా తన వద్దకు రాలేదని జవాబిచ్చారు.