రాష్ట్రీయం

తక్షణ కర్తవ్యం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 2: ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బి భోసలే శనివారం ఉదయం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సిఎస్ ఠాకూర్‌ను కలిసి అత్యంత వివాదాస్పదంగా మారిన ఉమ్మడి హైకోర్టు విభజనపై సమాలోచనలు జరిపారు. గతరాత్రి ఢిల్లీకి వచ్చిన భోసలే శనివారం ఉదయం ఠాకూర్ నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. అరగంటపాటు జరిగిన ఈ చర్చల్లో హైకోర్టు విభజనతోపాటు ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన న్యాయమూర్తులకు హైకోర్టులో సమతూక ప్రాధాన్యత ఇవ్వటం, సబార్డినేట్ న్యాయాధికారుల నియామకం, తెలంగాణలో కొనసాగుతున్న స్థానిక న్యాయాధికారుల నిరసన ఉద్యమం, రాజీనామాలు, తొలగింపులపై చర్చ జరిగిందని అంటున్నారు. ఉమ్మడి హైకోర్టును విభజించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు విడివిడిగా హైకోర్టులు ఏర్పాటు చేయటంపై జరుగుతున్న జాప్యం గురించి వారు సమీక్షించినట్లు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన రాజధాని అమరావతిలో కొత్త హైకోర్టు భవనం నిర్మించిన తరువాత ఏపి హైకోర్టును ఏర్పాటు చేయటం లేదా విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఏదైనా భవనాన్ని తీసుకుని హైకోర్టును ప్రారంభించటం లేదా హైదరాబాదులోనే విడిగా భవనాలు సేకరించి హైకోర్టును ప్రారంభించటంపై చర్చలు జరిగాయనే మాట వినిపిస్తోంది. హైదరాబాదులో విడిగా భవనాలు తీసుకుని ఏపి హైకోర్టును ప్రారంభించటంపై ఏపి ప్రభుత్వం నుండి వ్యతిరేకత రావటం తెలిసిందే. ఏపి హైకోర్టుకోసం విడిగా భవనాలు కేటాయించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావట తెలిసిందే. ప్రస్తుత హైకోర్టు భవనంలో ఏపి హైకోర్టును కొనసాగించాలనుకునే పక్షంలో తెలంగాణకు వేరే భవనాల్లో హైకోర్టును ఏర్పాటు చేయాలని కూడా తెలంగాణ ప్రభుత్వం గతంలో సూచించింది. అయితే ఏపి ప్రభుత్వం ఈ రెండు ప్రతిపాదనలకు సమ్మతించకుండా నూతన రాజధాని అమరావతిలో నూతన భవనాలు నిర్మించిన తరువాతనే హైకోర్టును ఏర్పాటు చేసుకోవాలనుకుంటోంది. దీనిమూలంగా తెలంగాణ న్యాయవాదులు నిరసన తెలుపుతున్న విషయం కూడా చర్చకు వచ్చిందని అంటున్నారు. కొత్త రాజధానిలో హైకోర్టు భవనాన్ని నిర్మించుకునేందుకు తమవద్ద నిధులు లేవని చంద్రబాబు నాయుడు చెప్పటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉమ్మడి హైకోర్టు విభజన వివాదాన్ని ఎలా పరిష్కరించాలనే అంశంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టి సారించినట్లు తెలిసింది. ఉమ్మడి హైకోర్టులో ఏపికి చెందిన న్యాయమూర్తులు 18 మంది ఉంటే తెలంగాణకు చెందినవారు కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఉమ్మడి హైకోర్టు విభజన వివాదాన్ని వీలున్నంత త్వరగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలనే నిర్ణయానికి ఇరువురు న్యాయమూర్తులు వచ్చారని అంటున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి త్వరలోనే ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడవచ్చునని అంటున్నారు. ఠాకూర్‌తో చర్చలు జరిపిన అనంతరం దిలీప్ భోసలే శనివారం సాయంత్రం ముంబాయికి వెళ్లారు.

చిత్రం.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిఎస్ ఠాకూర్ నివాసానికి వెళుతున్న హైకోర్టు ప్రధాన నాయమూర్తి దిలీప్ భోసలే