రాష్ట్రీయం

ఉల్లాసంగా..ఉత్సాహంగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 2: ప్రజల్లో ఆరోగ్యం పట్ల ఆవగాహన కల్పించే లక్ష్యంతో నిర్వహిస్తున్న మారథాన్ పరుగు రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో నిలుపుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖ వాసులు ఉత్సాహంగా మారథాన్‌లో పాల్గొన్నారు. దేశ చరిత్రలోనే తొలి సారిగా విశాఖ సాగర తీరంలో నిర్వహించిన వైజాగ్ స్టీల్స్ నైట్ బే మారథాన్‌ను శనివారం రాత్రి ఆయన ప్రారంభించారు. తొలి సారిగా రాజధాని నగరం అమరావతిలో మారథాన్ నిర్వహించామని, ఇప్పుడు విశాఖలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని, త్వరలోనే తిరుపతిలో ‘సెవెన్‌హిల్స్ మారథాన్’ను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆరోగ్య వంతమైన సమాజం కోసం నడక, పరుగు ఎంత అవసరమో అందరికీ అర్ధం అయ్యే రీతిలో చెప్పేందుకే ఈ ప్రయత్నమన్నారు. ముంబై తర్వాత అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగే హైదరాబాద్ మారథాన్‌ను తానే ప్రారంభించానని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. భవిష్యత్‌లో మారథాన్ అంటే విశాఖ గుర్తుకు రావాలని, దేశం నలుమూలల నుంచే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా మారథాన్ ప్రియులు విశాఖ పోటీల్లో పాల్గొనే రీతిలో ఈ కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహించనున్నట్టు తెలిపారు. దేశంలోనే తొలి సారిగా రాత్రి వేళ, సాగరతీరంలో మారథాన్ నిర్వహించడం ద్వారా విశాఖ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ప్రతిష్ఠాత్మక నైట్ బే మారథాన్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఔత్సాహికులను చూస్తుంటే ముచ్చటేస్తోందని, తనకు కూడా పాల్గొనాలన్న ఉత్సాహం కలుగుతోందన్నారు. విద్యార్థులకు చిన్నతనం నుంచి యోగా, సాంస్కృతిక కార్యక్రమాల పట్ల అవగాహన కల్పించడంతో పాటు వారికి నచ్చిన కోర్సుల్లో నైపుణ్యాన్ని సాధించేలా విద్యా కార్యక్రమాలు ఉంటాయన్నారు. ప్రపంచలో ఎంతో ప్రాచుర్యం పొందిన బీచ్, సముద్రపు క్రీడలను ఇక్కడ నిర్వహించడం ద్వారా ఖ్యాతిని చాటుకోవచ్చన్నారు. బీచ్ క్రీడలతో పాటు సముద్రంలో యాటింగ్, సర్ఫింగ్ వంటి క్రీడాంశాలు నిర్వహించేందుకు ఈ ప్రాంతం భౌగోళికంగా అనుకూలమన్నారు. స్మార్ట్‌సిటీగా అభివృద్ధి దిశగా అడుగులేస్తున్న విశాఖ నగరంలో ప్రజలు కూడా స్మార్ట్‌గా ఉండాలంటే క్రీడలు, యోగా, తదితర అంశాల్ని సాధన చేయాలన్నారు. అనంతరం 10కె, 21కే మారథాన్ రన్‌లో విజేతలకు సిఎం చంద్రబాబు బహుమతులందజేశారు. మారథాన్ రన్ ప్రారంభానికి ముందు వర్షం కొద్ది సేపు అంతరాయం కల్పించినప్పటికీ 10కె, 21కె రన్ ప్రారంభయ్యే సమయానికి వర్షం తెరిపిచ్చింది. ఇక 5కె, 3కె రన్ ప్రారంభించాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు వేదిక వద్దకు చేరుకునే సమయానికి మళ్లీ వర్షం ఇబ్బంది పెట్టింది. అయినప్పటికీ యువతీ,యువకులు రన్‌లో పామల్గొనేందుకు సిద్ధపడ్డారు. అంతకు ముందు సిఎం చంద్రబాబు ప్రభుత్వ అతిథి గృహంలో అధికారులతో కొద్ది సేపు సమావేశ మయ్యారు.. మంత్రులు సిహెచ్ అయ్యన్న పాత్రుడు, కె అచ్చెన్నాయుడు, ఎంపిలు కె హరిబాబు, ఎం శ్రీనివాసరావు, కె మనోహరనాయుడు, అధికారులు పాల్గొన్నారు.

చిత్రం.. విశాఖ ఆర్కే బీచ్‌లో శనివారం బే మారథాన్‌ను ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు