రాష్ట్రీయం

శామీర్‌పేటలో ఉగ్రవాద అనుమానితుల విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 2: హైదరాబాద్‌లో భారీ పేలుళ్లతో విధ్వంసం సృష్టించాలన్న కుట్ర కేసులో అరెస్టయిన ఐదుగురు ఉగ్రవాద అనుమానితులను రాజధాని శివార్లలోని శామీర్‌పేటలో ఒక విశ్రాంతి భవనంలో ఎన్‌ఐఏ(నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజన్సీ) బృందాలు విచారిస్తున్నాయి. ఐదుగురు నిందితులు మహమ్మద్ ఇలియాస్ యజ్దానీ, మహమ్మద్ ఇబ్రహీం యజ్దానీ, మహ్మద్ ఇర్ఫాన్, హబీబ్ మహ్మద్ , అబ్దుల్ బిన్ అహమ్మద్ అలియాస్ ఫహాద్‌లను గ్రూపుగా, ఒక్కొక్కరిగా పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. వీరు ఇంకా ఏ ప్రదేశాల్లో పేలుడు పదార్థాలు ఉంచారో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పైగా స్థానికంగా వీరికి ఎవరెవరు సహకరించారో అడుగుతున్నారు. ఆదివారం నిందితులను నాందేడ్‌కు తీసుకెళ్లనున్నట్లు తెలిసింది. విచారణలో అనేక ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. వీరు అనంతపురంలోని ఒక లాడ్జిలో బస చేసినట్లు వెల్లడించారు. దీంతో ఎన్‌ఐఏ బృందం అనంతపురానికి వెళ్లి అక్కడ నిందితులకు సహకరించిన వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. నాంపల్లి కోర్టు నిందితులను 12 రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. కాగా, మరికొంత మంది అనుమానితులను ఎన్‌ఐఎ రానున్న రోజుల్లో అదుపులోకి తీసుకోనున్నట్లు తెలిసింది. నిందితులకు ఎలక్ట్రానిక్ పరికరాలు అందించిన ఏజన్సీలను కూడా ఎన్‌ఐఏ విచారించనుంది. కేరళ, కర్నాటక, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీకి చెందిన ఎన్‌ఐఏ బృందాలు ఈ విచారణలో పాల్గొన్నాయి.

చిత్రం..శనివారం హైదరాబాద్‌లో వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు