రాష్ట్రీయం

మిత్రుల ఘర్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 3: కృష్ణా పుష్కరాలకు ఘాట్లు, రహదారుల విస్తరణ పనుల్లో భాగంగా అధికారులు 40కి పైగా దేవాలయాలను కూల్చివేయడం మిత్రపక్షాలైన తెలుగుదేశం, బిజెపిల మధ్య కార్చిచ్చు రేపుతున్నది. ఆదివారంనాడు బిజెపి నేతలు కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్, ఇతర నాయకులతో కలసి ఆదివారం నగరానికి చేరుకుని పలు ప్రాంతాల్లో కూల్చివేసిన ఆలయాలను సందర్శించారు. చివరగా తొలగించిన గోశాల ప్రాంతంలో మీడియాతో మాట్లాడుతున్న సమయంలో అకస్మాత్తుగా తెదే నగర అధ్యక్షుడు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న బంధుమిత్రులు, అనుచరులతోపాటు అక్కడకు చేరుకుని బిజెపి నేతలపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. దీంతో రెండు వర్గాలు బాహాబాహీ తలపడే స్థాయికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా కన్నా, సోము, వెలంపల్లి దేవాలయాల తొలగింపుపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తప్పుబట్టారు. పైగా ప్రశ్నించే ధర్మకర్తలను టిడిపి నాయకులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. అసలు ధర్మకర్తలు పీఠాధిపతులతో చర్చించకుండా ఇలా వ్యవహరించడం తగదన్నారు. దీనిపై ఎంపి కేశినేని స్పందిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ సిఎంగా ఉన్నప్పుడు 300 హిందూ దేవాలయాలను తొలగించారని, రాజస్థాన్‌లో సిఎం వసుంధర రాజే అనేక దేవాలయాలను తొలగించారని చెప్పారు. ఇక బుద్దా వెంకన్న అయితే కన్నా లక్ష్మీనారాయణ, వెలంపల్లి శ్రీనివాస్ తమ స్వార్ధం కోసం కాంగ్రెస్‌ను వీడి బిజెపిలో చేరి ప్రస్తుతం ఆ పార్టీ ప్రతిష్టను దిగజార్చుతున్నారని విమర్శించారు.
ఇదిలాఉండగా పలువురు పీఠాధిపతులు సమావేశమై హిందువుల మనోభావాలను ప్రభుత్వం దెబ్బతీసిందంటూ వ్యాఖ్యానించారు. శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి మాట్లాడుతూ రాహు, కేతువుల ఆలయాన్ని తొలగించడం ప్రభుత్వానికి అరిష్టమన్నారు. మరోవైపు ఆలయాల కూల్చివేతకు నిరసనగా సోమవారం విజయవాడలో పలువురు పీఠాధిపతులు, మఠాధిపతుల నేతృత్వంలో ర్యాలీ జరపనున్నారు. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం తెలుగుదేశం, బిజెపి నాయకులతో సమావేశమై సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయనున్నారు.