రాష్ట్రీయం

సమస్యను పరిష్కరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 3: తెలుగు రాష్ట్రాల్లో సమస్యాత్మకంగా మారిన ఉమ్మడి హైకోర్టు వ్యవహారాన్ని త్వరలోనే పరిష్కరిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సిజేఐ) టిఎస్ ఠాకూర్ తెలిపారు. ఆదివారం ఢిల్లీ లో తనను కలిసిన తెలంగాణ న్యాయవాదులతో ఆయన మాట్లాడుతూ హైకోర్టుకు సంబంధించిన అన్ని సమస్యలనూ పరిష్కరిస్తామని, నిరసనలను మానుకోవాలని సూచించారు. తెలంగాణ న్యాయవాద సంఘాల ప్రతినిధులు సీజేఐతో పాటు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి అనిల్ ఆర్.దవేలతో విడివిడిగా భేటీ అయ్యారు. ఉదయం జస్టిస్ ఠాకూర్‌ను ఆయన నివాసంలో కలిసి న్యాయవాదుల నిరసనలు, సస్పెన్షన్‌కు దారితీసిన పరిస్థితులను వివరించారు. అనంతరం తెలంగాణ న్యాయవాద సంఘాల ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ న్యాయధికారుల నియామకాలను వెంటనే నిలిపివేయాలని, న్యాయమూర్తుల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని, హైకోర్టు విభజన సమస్యలను పరిష్కరించాలని సీజేఐని అభ్యర్థించామన్నారు. గంటపాటు సాగిన ఈ సమావేశంలో ప్రధాన న్యాయమూర్తి తాము లేవనెత్తిన అంశాలను అన్నింటినీ సావధానంగా విన్నారని న్యాయవాదులు తెలిపారు. కేంద్రం మార్గదర్శకాలు లేకుండా న్యాయధికారుల నియమకాలను జరిగిన విషయాన్ని సీజేఐ దృష్టికి తీసుకెళ్లామని, పునర్వ్యవస్థీకరణ చట్టం పేర్కొన్న విధంగా కేంద్ర కమిటీ వేసి నియామకాలు జరపాలన్న అంశాన్ని సీజేఐ సైతం అంగీకరించారన్నారు. ఈ విషయంపై న్యాయశాఖ మంత్రితో చర్చిస్తామని సీజేఐ చెప్పారన్నారు. తెలంగాణ న్యాయవాదులు నిరసనలను విరమించుకుంటేనే తాము జోక్యం చేసుకొంటామని లేనిపక్షంలో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని సీజేఐ సూచించారని న్యాయవాద సంఘాల ప్రతినిధులు వెల్లడించారు. ప్రధాన న్యాయమూర్తి నూచన మేరకు నిరసన విరమణపై హైదరాబాద్‌లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ న్యావాద ఐకాస నేతలు పేర్కొన్నారు. తెలంగాణ న్యాయవాద సంఘాల నేతలు మోహన్‌రావు, రాజేంద్రరావు, జితేందర్‌రెడ్డి, జయ్‌కార్, జనార్ధన్ రెడ్డి తదితరులు సీజే ఐని కలిసిన వారిలో ఉన్నారన్నారు.

చిత్రం.. హైకోర్టు అంశంపై పరిస్థితిని వివరించేందుకు సిజెఐ సిఎస్ ఠాకూర్‌ను
కలిసిన తెలంగాణ న్యాయవాదుల సంఘం ప్రతినిధులు