రాష్ట్రీయం

నేటి నుంచి బ్రిక్స్ సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 3: అంతర్జాతీయ ఇంధన సదస్సుకు విశాఖ మరోసారి వేదిక కానుంది. సోమ, మంగళ వారాల్లో బ్రిక్స్ అంతర్జాతీయ ఇంధన సదస్సును నిర్వహించేందుకు కేంద్రం ఆంధ్రప్రదేశ్‌ను ఎంపిక చేసింది. గ్రీన్ ఎనర్జీకి, ఇంధన పొదుపు చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహానికి గుర్తింపుగా సదస్సు నిర్వహణ బాధ్యతను ఏపీ సర్కార్‌కు కేంద్రం అప్పగించింది. ఈ సందర్భంగా ఇంధన వినియోగంలో తాము సాధించిన విజయాలను రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయంగా చాటుకునే అవకాశం ఉంటుంది. భారత్ అధ్యక్షతన జరిగే ఈ సదస్సులో బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు పాల్గొంటాయి. ప్యారిస్‌లో జరిగిన సీఓపీ-21 సదస్సులో విశాఖ ఎల్‌ఇడీ వీధిదీపాల అమరిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇపుడు ఈ సదస్సుకు విశాఖ వేదికగా ఉన్నందున ప్రపంచ దేశాలు ప్రత్యక్షంగా ఈ ఎల్‌ఇడి వీధి దీపాలను
చూసే అవకాశం లభిస్తుంది. సదస్సు నిర్వహణ ఏర్పాట్లపై ఆదివారం విజయవాడలో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పలు నిర్ణయాలు తీసుకున్నారు. రైతులో ఆనందంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచుకోవడం, విద్యుత్ వినియోగం తగ్గించేందుకు ఇంధన సమర్థత కలిగిన ఎల్‌ఇడి బల్బులు, ఐదు స్టార్‌రేటెడ్ ఫ్యాన్లు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, వ్యవసాయ మోటర్ల వాడకాన్ని పెంచుతున్నామన్నారు. ఈ సదస్సును సమర్థంగా నిర్వహించగలమన్న నమ్మకంతోనే రాష్ట్రానికి కేంద్రం ఈ బాధ్యతను అప్పగించిందన్నారు. ఇందుకు విశాఖ వేదిక కావడం ఎంతో గర్వకారణమన్నారు. కేంద్ర విద్యుత్‌శాఖ మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ కుమార్ మాట్లాడుతూ ఇంధన కార్యదర్శి అజయ్‌జైన్‌కు రాసిన లేఖలో అన్ని బ్రిక్స్ దేశాలు విశాఖ వేదికగా జరిగే అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందుకు సుముఖత వ్యక్తంచేశాయన్నారు. ఇందులోభాగంగా విశాఖలోని ఎల్‌ఇడి వీధి దీపాలను అమర్చిన పద్ధతిని, దాని ద్వారా సాధించిన 70 లక్షల యూనిట్ల విద్యుత్ పొదుపు, 420 లక్షల ఆదాని క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి ఆసక్తిని కనబర్చారన్నారు. స్టేట్ ఎనర్జీ కన్సర్వేషన్ మిషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏ.చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక ఇంధన పొదుపు, ఇంధన సమర్థత ప్రాజెక్టుల అమలు బ్రిక్స్ దేశాల ఆర్థిక వ్యవస్థను బలపరుస్తాయన్నారు. ఇంధన పొదుపు- సమర్థతపై రెండు రోజులు జరిగే ఈ సదస్సులో అన్ని దేశాల అధికారిక బృందాలు కూలంకషంగా చర్చించి ఇంధన సమర్థతలో ఆచరించాల్సిన మార్గదర్శక సూత్రాలను సంయుక్తంగా ప్రకటిస్తాయన్నారు.