రాష్ట్రీయం

గుడుల జోలికెళ్లం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 3: ధర్మకర్తలు, సంబంధిత వ్యక్తులు భక్తులతో చర్చించకుండా ఇక దేవాలయాల జోలికి ప్రభుత్వం వెళ్లదని ఆదివారం సాయంత్రం జరిగిన అత్యవసర సమావేశంలో ఐదుగురు రాష్ట్ర మంత్రులు స్పష్టం చేశారు. ఇక ఈ వివాదంపై రాద్ధాంతం చేయవద్దని మంత్రులు పైడికొండల మాణిక్యాలరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, ప్రత్తిపాటి పుల్లారావు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలపై రాష్ట్ర మంత్రులు ఆగమేఘాలపై రెవెన్యూ, పోలీసు, దేవాదాయశాఖ ఉన్నతాధికారులతో సమావేశమై ఆలయాల తొలగింపుపై చర్చించారు. కేవలం అభివృద్ధి పనుల్లో భాగంగానే రహదారులకు అడ్డంకిగా ఉన్న ఆలయాలనే తొలగించడం జరిగిందని అధికారులు వివరించారు. పార్లమెంట్ సభ్యుడు కేశినేని శ్రీనివాస్ మాట్లాడుతూ రామవరప్పాడు జంక్షన్ అభివృద్ధిలో మసీదును తొలగిస్తే ఇదే బిజెపి నేతలు ఎందుకు మాట్లాడలేదని, ఇప్పుడు ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నిస్తూ సమావేశం నుంచి అర్థంతరంగా వెళ్లిపోయారు. దేవాదాయ మంత్రి పి మాణిక్యాలరావుమాట్లాడుతూ కూల్చిన ఆలయాలను అదే స్థానంలో పునర్నిర్మించాలన్నారు. రోడ్డు విస్తరణ కోసం భవిష్యత్‌లో ఏదైనా ఆలయాన్ని కూల్చవలసి వస్తే ముందుగా అన్ని రకాల అనుమతులు తీసుకోవాలన్నారు. గోశాల అంశాన్ని సామరస్యంగా పరిష్కరిద్దామన్నారు. మంత్రి దేవినేని ఉమ మాట్లాడుతూ భక్తుల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వం ఇక ముందు చర్యలు చేపడుతుందన్నారు. అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అందరూ సహకరించాలన్నారు. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి పూర్తి స్థాయిలో చర్చించాలని నిర్ణయించారు.

చిత్రం.. తొలగించిన ఆలయాన్ని పరిశీలిస్తున్న మంత్రులు