రాష్ట్రీయం

కనె్నపల్లే కరెక్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/మహదేవ్‌పూర్, జూలై 3: మేడిగడ్డ (కాళేశ్వరం ప్రాజెక్టు) బ్యారేజీ నిర్మాణానికి కనె్నపల్లి అనువైనదని అధికారులు ఆదివారం గుర్తించారు. నీటిపారుదల శాఖ ఇంజనీర్లు కాళేశ్వరం పంపు హౌస్‌లు, బ్యారేజీల నిర్మాణానికి అనువైన స్థలాన్ని ఆదివారం పరిశీలించారు. మరోవైపు భోపాల్‌లోని బిహెచ్‌ఇఎల్ యూనిట్‌లో తయారవుతున్న లిఫ్ట్‌లకు సంబంధించిన యంత్రాలను ఈరోజు ఉన్నతాధికారుల బృందం పరిశీలించింది. నీటిపారుదల శాఖ ఇఎన్‌సి మురళీధర్‌రావు, ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీరు ఎన్ వెంకటేశ్వర్లు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు కాళేశ్వరం పంపు హౌజ్‌లు, బ్యారేజీల నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. మరో రెండు రోజుల్లో స్థలాన్ని ఖరారు చేస్తామని సిఇఎన్ వెంకటేశ్వర్లు తెలిపారు.
మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు, పంప్ హౌస్‌ల కోసం స్థలాల ఎంపిక జరుగుతోంది. ఈ మూడు బ్యారేజీల కోసం భూ సేకరణ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. భూసేకరణ పనులు త్వరగా చేయాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. 15 రోజుల్లో మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల దగ్గర క్యాంప్‌లను ఏర్పాటు చేసి పనులు ప్రారంభించాలని చెప్పడంతో ఇరిగేషన్ శాఖ యంత్రాంగం రంగంలోకి దిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్లు, జెన్‌కో అధికారుల బృందం మధ్యప్రదేశ్ భోపాల్‌లోని బిహెచ్‌ఇఎల్‌ను సందర్శించింది. ఈ ప్రాజెక్టులో అంతర్భాగంగా ఇదివరకే చేపట్టిన ప్యాకేజీలు 6, 8, 10,11,12 లకు అవసరమైన పంపులు, మోటార్ల తయారీని పరిశీలించారు. భోపాల్ బిహెచ్‌ఇఎల్ యూనిట్‌లో లిఫ్టునకు సంబంధించిన యంత్రాలు తయారవుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్టు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించినందున బెంగళూరు, ఢిల్లీ, భోపాల్ బిహెచ్‌ఇఎల్ యూనిట్లలో పంపులు, మోటార్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వానికి తెలిపారు. కాళేశ్వరం డిఇ నర్సింగ్‌రావు, జెన్‌కో ఎడి ఇ ఉపేందర్ భోపాల్ బిహెచ్‌ఇఎల్ యూనిట్‌ను సందర్శించి ఆ యూనిట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌తో యంత్రాల తయారీ పురోగతిని అడిగి తెలుసుకున్నారు. సోమవారం నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ఊపందుకోనున్నాయని అధికారులు తెలిపారు. పంప్ హౌస్‌లు, యంత్రాల నిర్మాణానికి నిర్ణీత కాల వ్యవధిని ఇంతకు ముందే నిర్ణయించారు. ఆరు, ఎనిమిది ప్యాకేజీల పంపు హౌస్‌ల నిర్మాణం 2017 జూలై నాటికి పూర్తి చేసి నీటిని అందించాలని నిర్ణయించారు. 10,11,13 పంప్ హౌస్‌లను 2017 సెప్టెంబర్ నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. డిసెంబర్ నాటికి ప్యాకేజీ 20 పంప్ హౌస్‌ల నిర్మాణం పూర్తి చేస్తారు.

చిత్రాలు.. భోపాల్‌లోని బిహెచ్‌ఇఎల్ యూనిట్‌లో తయారవుతున్న వాటర్ లిఫ్ట్ యంత్రాలను ఉన్నతాధికారుల బృందం పరిశీలించింది. మేడిగడ్డ ప్రాజెక్టు కోసం స్థల పరిశీలనలో నీటిపారుదల శాఖ ఇంజనీర్లు అధికారులు. భోపాల్ భెల్‌లో శరవేగంగా తయారవుతోన్న మేడిగడ్డ (కాళేశ్వరం ప్రాజెక్టు) బ్యారేజీ నిర్మాణానికి యంత్ర సామగ్రి