రాష్ట్రీయం

ముచ్చర్ల రైతులకు అన్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 3: రంగారెడ్డి జిల్లాలోని రైతులకు జిఓ నెం 123తో అన్యాయం జరుగుతోందని, ఈ జివో ద్వారా రైతులకు రూ. 300 కోట్లు నష్టం జరిగిందని ఉపాధి హామీ పరిహారం ఇవ్వకపోవడంతో మరో వంద కోట్లు నష్టం వాటిల్లిందని తెలంగాణ భూ నిర్వాసితుల కమిటీ కన్వీనర్ బి వెంకటేశ్ ఆరోపించారు. భూములు సేకరిస్తున్న ముచ్చర్ల, మీర్‌ఖాన్‌పేట్, కందుకూర్, పంజాగూడ గ్రామాల్లో భూ నిర్వాసితుల కమిటీ రెండు రోజులు పర్యటించింది. ప్రజలు, రైతులు వారి గోడును విన్నవించారని కమిటీ కన్వీనర్ వెంకటేశ్ ఆదివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు. ముచ్చర్లలో రిజిస్ట్రేషన్ రేటు అధికారికంగా ఎకరాకు రూ. 7.50 లక్షలు ఉందని, మీర్‌ఖాన్‌పేట్, పంజాగూడలో రూ. 6.5 లక్షలు ఉందని, 2013 చట్టం ప్రకారం ఎకరాకు రిజిస్ట్రేషన్ మూడు రేట్ల చొప్పున ముచ్చర్ల రూ. 22.50 లక్షల చొప్పున, పంజాగూడలో రూ. 18.15 లక్షల చొప్పున రావాలి. కానీ అందుకు బదులు జివో నెం 123 ప్రకారం ఎకరాకు పట్టాదారుడి రూ. 12.50 లక్షలు, అసైన్డ్ పట్టాదారుడికి రూ. 8 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు.